పేరుకే అతను స్టార్ హీరో.. యాక్టింగ్ అస్సలు రాదు.. అందుకే అలాంటి సినిమాలు సెలక్ట్ చేసుకుంటాడు..
2001లో ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది రిమీ సేన్. అందరి వాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక హిందీ ధూమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. ఇక 2011లో ధులియా దర్శకత్వంలో వచ్చిన తిగ్మాన్షూ అనే సినిమాలో చివరిగా కనిపించిందీ అందాల తార.

రిమి సేన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీ, బెంగాలీ సినిమాలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ సినిమాలు చేసి మెప్పించింది. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా..విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.. తక్కువ సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవితోనూ నటించింది ఈ అందాల భామ. రిమి సేన్ అసలు పేరు సుభమిత్ర సేన్. ‘పరోమితర్ ఏక్ దిన్’ అనే బెంగాలీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. ఆ తర్వాత తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ(2001) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
ఆ తర్వాత నీ తోడు కావాలి(2002), చిరంజీవి అందరివాడు(2005) లాంటి తెలుగు చిత్రాలలో నటించింది. హిందీలో ధూమ్(2004), క్యోన్ కి(2005), గరం మసాలా(2005), గోల్‌మాల్(2006) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల భామ ఓ స్టార్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరోకు యాక్టింగ్ రాదు అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
ఆహీరో ఎవరో కాదు.. బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం. రిమి సేన్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. జాన్ మొదట్లో మోడలింగ్ చేశాడు. యాక్టింగ్ అనేదే అస్సలు రాదు. అతని యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నా జాన్ పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్‌కు బదులుగా స్టైలిష్‌గా, స్క్రీన్‌పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే సెలక్ట్ చేసుకునేవాడు.. చాలా తెలివైనవాడు. యాక్షన్ సినిమాలాంటివి.. ఆతర్వాత మెల్లగా నటన నేర్చుకున్నాడు. రెగ్యులర్ గా కెమెరా ముందుకు రావడంతో ఆతని నటన మెరుగుపడింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




