ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యినప్పుడు చాలా బాధపడ్డా.. : కృష్ణవంశీ
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా రంగమార్తాండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కృష్ణవంశీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా మురారి సినిమా మహేష్ బాబు కెరీర్‌కు ఎంత కీలకమో వివరించారు.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా రంగమార్తాండ అనే సినిమా చేశారు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ ఎవరితో సినిమా చేస్తారా.? అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కృష్ణవంశీ.. ఓ సినిమా ఫ్లాప్ అవ్వడం తనకు షాక్ ఇచ్చిందని తెలిపారు. ఆ సినిమా భారీ హిట్ అవుతుందని అనుకున్నా కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది అని అన్నారు. ఇంతకూ కృష్ణవంశీ చెప్పింది ఎవరి సినిమా గురించంటే..
కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాగురించి మాట్లాడారు. రాఖీ చిత్రం మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అవగాహన కల్పించే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య కొన్ని వందల సంవత్సరాలుగా ఉందని, ఇది కేవలం మీడియా ఫ్లేర్-అప్ వల్ల మాత్రమే ఎక్కువ అవుతుందే తప్ప, మనిషి ఉన్నంత కాలం ఇది ఉంటుందని కృష్ణవంశీ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా కథా నేపథ్యం గురించి మాట్లాడుతూ, రాధాకృష్ణ అనే వ్యక్తి చంద్రలేఖ లేదా సింధూరం చిత్రాల సమయంలో తనకు ఈ కథను పది సంవత్సరాల ముందే చెప్పారని గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో తన సొంత కథలు మాత్రమే చేస్తానని చెప్పినప్పటికీ, రాధాకృష్ణ పట్టుబట్టడంతో నాలుగున్నర గంటల పాటు కథను విన్నానని తెలిపారు. ఆ కథ రాగా ఉందని, సూర్యాపేట నేపథ్యంతో ఉందని చెప్పారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు, ఆయనకున్న అద్భుతమైన నటన, డ్యాన్సింగ్, డైలాగ్ డెలివరీ, జ్ఞాపకశక్తి వంటి ఉన్నాయి కాబట్టి అతని సరిపోయే కథ కావాలని భావించినప్పుడు రాఖీ కథ గుర్తుకు వచ్చిందన్నారు. రాధాకృష్ణ చెప్పిన కథను పూర్తిగా మార్చి, కొన్ని క్యారెక్టర్లు, సీక్వెన్స్‌లు మాత్రమే తీసుకుని, స్క్రీన్ ప్లేను రీ-వర్క్ చేసి, పాటలు, ఫైట్స్ వంటి అంశాలను జోడించి ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అడాప్ట్ చేసినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. కథకు మూలం, గుండెకాయ రాధాకృష్ణదే అయినా, దానిని తన అనుభవాలు, రియాక్షన్లు జోడించి ఎన్టీఆర్ పవర్ కోసం తీర్చిదిద్దానని ఆయన స్పష్టం చేశారు. కథ వినగానే ఎన్టీఆర్ బాగుందన్నయ్యా, చేసేద్దాం అన్నారని తెలిపారు. సినిమాను కష్టపడి చేశామని అన్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా బాధ పడ్డాను అని తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
