AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండిన తులసి ఆకులు, కాడలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే అవాక్కవుతారు..

హిందూ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం పూజలకే కాదు, ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేయడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మొక్క ఎండిపోయిన తర్వాత కూడా దానిలోని ప్రతి భాగం అమూల్యమైనదే. ఎండిన తులసిని ఇంట్లోనే ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 31, 2026 | 10:58 AM

Share
ప్రస్తుతం మార్కెట్లో లభించే కాయిల్స్, లిక్విడ్లలో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు ఉంటాయి. వీటికి బదులుగా ఎండిన తులసి ఆకులను చిన్న ముక్కలుగా చేసి, కొద్దిగా కర్పూరంతో కలిపి కాల్చాలి. దీని నుండి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపించి.. ఇంటి మూలల్లో దాక్కున్న దోమలు, ఈగలు, ఇతర చిన్న కీటకాలను తక్షణమే తరిమికొడుతుంది. ఇది పూర్తిగా సురక్షితమైన, రసాయన రహిత పద్ధతి.

1 / 5
ఎండిన తులసి కాడలు చాలా సన్నగా ఉంటే వాటిని బాగా శుభ్రం చేసి నీటితో నింపిన రాగి పాత్రలో కొన్ని గంటల పాటు ఉంచాలి. దీనివల్ల తులసిలోని ఔషధ గుణాలు ఆ నీటిలోకి చేరుతాయి. ఈ పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. ఆధ్యాత్మికంగా ఇది ఇంటి స్వచ్ఛతను, సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది.

2 / 5
ఎండిన తులసి మొక్క యొక్క కాండం, వేర్లు, ఆకులను చిన్న చిన్న ముక్కలుగా నరికి లేదా నూరి.. మీ తోట మట్టిలో లేదా కుండీలలో కొంచెం లోతుగా పాతిపెట్టండి. ఇది మట్టి నాణ్యతను పెంచడమే కాకుండా ఇతర మొక్కలకు సోకే ఫంగస్, వేరు కుళ్లు లేదా రకరకాల కీటకాల బారి నుండి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది.

3 / 5
ఎండిన తులసి కాడలు, ఆకులను నూరిన తర్వాత మిగిలిన ముతక పొడిని వంటింటి ఔషధంగా మార్చుకోవచ్చు. ఈ పొడికి రెండు మూడు టీస్పూన్ల ఎండిన గులాబీ రేకులు, లవంగాలు, యాలకులు, సోంపు గింజలు, ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను కలిపి మెత్తని మిశ్రమంలా చేయాలి. ఈ హోంమేడ్ మసాలాతో తయారుచేసే మసాలా చాయ్ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా.. బాడీలో ఇమ్యూనిటీని పెంచి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
ఇంట్లో చిన్నపాటి హోమాలు చేసినప్పుడు లేదా ప్రతిరోజూ సాయంత్రం పూజ తర్వాత చేసే హారతిలో ఎండిన తులసి ముక్కలను ఉపయోగించవచ్చు. కర్పూరం, అగర్‌బత్తిలతో పాటు ఈ తులసి ముక్కలను కాల్చడం వల్ల వెలువడే పవిత్రమైన పొగ ఇళ్లలోని ప్రతికూల శక్తులను తొలగించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాకుండా ఈ పొగ గాలిని శుద్ధి చేసే సహజ క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది.

5 / 5
Follow Us