AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? మీరు చేసే పెద్ద తప్పు ఇదే..

అన్నం వండే ముందు బియ్యాన్ని తెల్లగా, మెరిసేలా మార్చాలనే తాపత్రయంతో చాలాసార్లు రుద్ది రుద్ది కడుగుతున్నారా? అయితే మీరు మీ చేతులతోనే మీ ఆరోగ్యానికి పెద్ద అన్యాయం చేస్తున్నట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బియ్యాన్ని పదేపదే బలంగా కడగడం వల్ల అందులోని అసలైన విటమిన్లు, పోషకాలన్నీ నీటిలో కొట్టుకుపోయి, మనం కేవలం పిండిపదార్థాన్ని మాత్రమే తింటున్నామట. అసలు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి?

అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? మీరు చేసే పెద్ద తప్పు ఇదే..
How Many Times To Wash Rice Before Cooking
Krishna S
|

Updated on: May 31, 2026 | 11:20 AM

Share

ప్రతి రోజూ వంటింట్లో బియ్యం కడగడం ఒక నిరంతర ప్రక్రియ. కానీ చాలా మంది బియ్యాన్ని పదేపదే, బలంగా నూరి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని, పైగా నష్టాలే ఎక్కువని ఆరోగ్య నిపుణులు, ప్రముఖ చెఫ్‌లు హెచ్చరిస్తున్నారు. బియ్యాన్ని పండించేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు రకరకాల పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తుంటారు. అలాగే ప్యాకింగ్ చేసే సమయంలో దుమ్ము, చిన్న రాళ్లు, పొట్టు వంటివి అందులో చేరతాయి. వీటన్నింటితో పాటు బియ్యంపై ఉండే అదనపు పిండిపదార్థాన్ని శుభ్రం చేయడానికి వండే ముందు కడగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దగా అవ్వకుండా, చక్కగా పొడిపొడిగా, పొడవుగా వస్తుంది.

ఎక్కువసార్లు కడగడం వల్ల జరిగే నష్టం ఇదే

బియ్యాన్ని పదేపదే బలంగా రుద్ది కడగడం వల్ల అందులోని కీలకమైన పోషకాలు పూర్తిగా నశిస్తాయి. బియ్యపు పైపొరలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బి-కాంప్లెక్స్, ఐరన్, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. బియ్యాన్ని ఎక్కువసార్లు రుద్దినప్పుడు ఈ పోషకాలన్నీ నీటిలో కరిగి వృధాగా పోతాయి. దీనివల్ల అన్నం తిన్నా శరీరానికి అందాల్సిన శక్తి లభించదు. అంతేకాదు ఎక్కువసార్లు కడగడం వల్ల బియ్యం యొక్క సహజ సువాసన, రుచి కూడా తగ్గిపోతాయి.

2 లేదా 3 సార్లు మాత్రమే

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బియ్యాన్ని గరిష్టంగా రెండు లేదా మూడు సార్లు మాత్రమే కడగాలి. నీళ్లు పూర్తిగా పారదర్శకంగా మారేంత వరకు కడగాల్సిన అవసరం లేదు.

మొదటిసారి: బియ్యంలో నీళ్లు పోసి, చేతులతో తేలికగా పిసకడం వల్ల అందులోని దుమ్ము, మైక్రోప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి. ఆ నీటిని వంపేయాలి.

రెండోసారి: బియ్యం గింజలు విరగకుండా చాలా తేలికగా కడగాలి. దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది.

మూడోసారి: మరోసారి నీళ్లు పోసి తేలికగా కలిపితే బియ్యం పూర్తిగా వండుకోవడానికి సిద్ధమవుతాయి.

బియ్యం కడిగిన నీటిని పారేయకండి

  • బియ్యం కడిగిన తర్వాత వచ్చే నీటిని పారబోయకుండా అమూల్యమైన ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.
  • ఈ నీటిని ఇంట్లోని కుండీలలో లేదా తోటలోని మొక్కలకు పోస్తే, అది మొక్కల ఎదుగుదలకు అద్భుతమైన సహజ ఎరువుగా పనిచేస్తుంది.
  • బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కుంటే, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

Follow Us
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? ఇలా చేస్
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? ఇలా చేస్
చికెన్ 65కి ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు కథ ఇదే..!
చికెన్ 65కి ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు కథ ఇదే..!
ఈడొచ్చిన అమ్మాయిలకు ఇది అమృతం లాంటిది..
ఈడొచ్చిన అమ్మాయిలకు ఇది అమృతం లాంటిది..
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న పవన్ కల్యాణ్ కీలక సమావేశం
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న పవన్ కల్యాణ్ కీలక సమావేశం
ఎండిన తులసి ఆకులు, కాడలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే..
ఎండిన తులసి ఆకులు, కాడలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే..
విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. TV9 & KAB Education Expo 2026..
విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. TV9 & KAB Education Expo 2026..
ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది?
ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది?
మీ బంగారం అమ్ముతున్నట్లయితే ఎంత పన్ను విధిస్తారో తెలుసా..?
మీ బంగారం అమ్ముతున్నట్లయితే ఎంత పన్ను విధిస్తారో తెలుసా..?
పిండి రుబ్బే పని లేకుండా.. అప్పటికప్పుడు క్రిస్పీ గోధుమ రవ్వ దోశ
పిండి రుబ్బే పని లేకుండా.. అప్పటికప్పుడు క్రిస్పీ గోధుమ రవ్వ దోశ