దివ్య భారతి.. ఈ అందాల భామ ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. బ్యాచిలర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే ‘కింగ్‌స్టన్’ చిత్రంలో నటించింది.
1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మాడి ఖాతాలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న గోట్ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఇప్పటికీ చాట్‌బస్టర్‌గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘మహారాజా’ మూవీలో దివ్యభారతి స్పెషల్ రోల్ చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయట పెట్టింది. కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఒక ప్రొఫెసర్ ని పిచ్చి పిచ్చిగా ప్రేమించినట్టు తెలిపింది. బీటెక్ ఫైనల్ ఇయర్ లో నేను ఒకతన్ని ఇష్టపడ్డాను. కానీ ఆయన ప్రొఫెసర్ అని నాకు తర్వాత తెలిసింది. అయితే ఆయన వేరే బ్రాంచ్ ప్రొఫెసర్. ఒకరోజు నేను అతన్ని చూస్తుంటే అతను కూడా నన్ను చూసాడు. ఆ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి మా సర్ నీ నెంబర్ అడిగితే ఇచ్చాను అని చెప్పింది. దాంతో నేను ఆమె పై కోప్పడ్డాను.. ఒకరోజు సడన్ గా కాల్ చేశారు. ఆ తర్వాత రెగ్యులర్ గా మాట్లాడుకునేవాళ్లం.. ఒకర్నొకరు చాలా ఇష్టపడ్డాం.. కానీ కాలేజ్ అయ్యాక ఆ లవ్ బ్రేక్ అయింది.. ఆ తర్వాత నా మొదటి సినిమా రిలీజ్ అయ్యాక కాల్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారు.. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతారు చెప్పుకొచ్చింది దివ్యభారతి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..