అతనంటే నాకు పిచ్చి ఇష్టం.. లవ్లీ బాయ్ అంటూ ప్రేమ కురిపించిన జబర్దస్త్ నటి
తెలుగు సినిమాల్లో మెల్ కమెడియన్స్ మాత్రమే కాదు లేడీ కమెడియన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు కొందరు మహిళా కమెడియన్స్.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది లేడీ కమెడియన్స్ నవ్వులు పూయించారు. అలాగే సినిమాల్లోనూ ఆకట్టుకుంటున్నారు. వారిలో సత్యశ్రీ ఒకరు.

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో లేడీ కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ షోలో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వారిలో సత్య శ్రీ ఒకరు. జబర్దస్త్ లోనే కాదు పలు సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించింది సత్య శ్రీ. రీసెంట్ గా రిలీజ్ అయిన నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి సినిమాల్లో బిజీ అయ్యింది సత్య శ్రీ. కాగా ఈ అమ్మడు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
సత్య శ్రీ మాట్లాడుతూ.. తనస్కూల్, కాలేజ్ రోజుల్లో చాలా మంది తనకు ప్రపోజ్ చేశారని, అయితే తాను వాటికి అంగీకరించలేదని ఆమె తెలిపారు. తన తండ్రి, అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్, తన కుటుంబం గురించి తెలిసిన తర్వాత ఎవరూ తన వద్దకు వచ్చి మాట్లాడే సాహసం చేసేవారు కాదని సత్య శ్రీ చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఒక వ్యక్తి పదే పదే తన వెంటపడగా, తన తండ్రి జోక్యం చేసుకుని అతడిని పిచ్చి కొట్టుడు కొట్టారని, ఆ తర్వాత నుంచి ఆ వ్యక్తి తన జోలికి రాలేదని తెలిపింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తనకు ఎవరూ ప్రపోజ్ చేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపింది.
ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి తనకు లేదని సత్య శ్రీ స్పష్టం చేసింది. తన స్నేహితులు , గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు తనని ఆలోచింపజేశాయని తెలిపింది. ఆడపిల్లల ఆశలను అణచివేసి పెళ్లిళ్లు చేయడం, చదువులను మధ్యలోనే ఆపేయడం, చిన్న వయసులోనే వివాహాలు చేయడం వంటి సమస్యలు తనని తీవ్రంగా కలిచివేశాయని, మగవాడు సంపాదించాలి, ఆడవాళ్లు పెళ్లి చేసుకోవాలి అనే పాతకాలపు ఆలోచనలను సత్య శ్రీ వెతిరేకించింది. ఆడపిల్లలు కూడా తమ తల్లిదండ్రులను పోషించగలరని, తన కుటుంబానికి తానే దిక్కై చూసుకుంటున్నానని తెలిపింది. పెళ్లిపైన ఆలోచన లేదని.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన కెరీర్ పైనే ఉందని, ముఖ్యంగా తన చెల్లి పెళ్లి చేయడమే తన ప్రధాన లక్ష్యమని సత్య శ్రీ తెలిపింది. అలాగే తనకు ఇండస్ట్రీలో చాలా మందిలో రామ్ పోతినేని అంటే చాలా ఇష్టమని, ఆయన చాలా లవ్లీ బాయ్ అని తెలిపింది. పండగ చేస్కో సినిమాలో ఆయనతో కలిసి పని చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆ సమయంలో ఒక ఫోటో అడగడానికి కూడా చాలా కష్టపడ్డానని సరదాగా గుర్తు చేసుకుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




