Daali Dhananjay: ‘మేం ముగ్గురం కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన పుష్ఫ ‘జాలిరెడ్డి’
పుష్ప, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డిగా అలరించిన కన్నడ నటుడు డాలీ ధనంజయ్ త్వరలో తండ్రి కానున్నాడు. ప్రస్తుతం అతని భార్య నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా డాలీ ధనుంజయే అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు డాలీ ధనంజయ్. ఇక పుష్ప, పుష్ప 2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే సత్యదేవ్ తో కలిసి జీబ్రా అనే సినిమాలోనూ సెకెండ్ హీరోగా నటించాడు డాలీ. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక డాలీ ధనంజయ్ గత సంవత్సరం ఫిబ్రవరిలో ధన్యత అనే వైద్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరి తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం తన భార్య గర్భంతో ఉన్న విషయాన్ని స్వయంగా డాలీనే అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఈ నటుడు ఒక అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డాలీ మాట్లాడుతూ తన కుటుంబంలోకి మరొకరు వస్తున్నారంటూ శుభవార్తను పంచుకున్నాడు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డాలీ ధనుంజయ్, ధన్యత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న డాలీ ధనంజయ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇక పుష్ప, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లోనూ ఈ హీరోకు గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం అ ‘హలగలి’, ‘666 ఆపరేషన్ డ్రీమ్ ప్రాజెక్ట్’, ‘జింగో’, ‘అన్నా ఫ్రమ్ మెక్సికో’, ‘ఉత్తరకాండ’ చిత్రాల్లో నటిస్తున్నాడు డాలీ. అలాగే ‘హెగ్గన ముద్దు’ సహా మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నాడు.
భార్యతో పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ్..
View this post on Instagram
డాలీ ధనంజయ్ భార్య పేరు ధన్యత. పెళ్లికి ముందే వీరు ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. మైసూర్‌లో కలిసి చదువుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. గతేడాది ఫిబ్రవరి 16న మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో డాలీ, ధన్యత ల వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు.
డాలీ ధనంజయ్, ధన్యతల పెళ్లి ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




