AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి శివ కార్తికేయన్ ఫ్లాప్ సినిమా.. ‘పరాశక్తి’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా పరాశక్తి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం తమిళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే రాబట్టింది.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి శివ కార్తికేయన్ ఫ్లాప్ సినిమా.. 'పరాశక్తి' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Parasakthi Movie
Basha Shek
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 3:33 PM

Share

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి ప్రధాన పాత్రలు పోషించారు. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మొదట పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న ఈ మూవీ వివిధ కారణాలతో కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే రిలీజైంది. థియేటర్ల కొరతతో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కు నోచుకోలేకపోయింది. దీనికి తోడు పరాశక్తి సినిమాను వరుస వివాదాలు వెంటాడాయి. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు సుధ కొంగర. దీంతో మొదటి నుంచి ఈ సినిమా కంటెంట్ పై వివాదాలు చెలరేగాయి. ఇక మూవీ రిలీజయ్యాక ఆ నిరసనల వేడి మరింత పెరిగింది. పరాశక్తి సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ కూడా చేసింది. అయినా ఇలా వివాదాలు చెలరేగినా, మిక్స్ డ్ టాక్ వచ్చినా పరాశక్తి సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది.

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన పరాశక్తి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో పరాశక్తి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఆవిరైన శ్రీలీల ఆశలు..

కాగా ఇప్పటివరకూ గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన శ్రీలీల పరాశక్తిలో మాత్రం కాస్త యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. పైగా తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు కూడా సమాచారం. అయితే ఇక్కడ కూడా ఆమెను దురదృష్టం వెంటాడింది. పరాశక్తి సినిమా కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. దీంతో తెలుగు ఆడియెన్స్ కు ఆమె యాక్టింగ్ చూసే అవకాశం దక్కలేదు. ఇక చివరకు సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే