నన్ను ఆ హీరో పాప అని పిలుస్తాడు.. చాలా మంది వ్యక్తి అతను.. శ్రీదేవి విజయ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్
శ్రీ దేవి విజయ్ కుమార్.. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు ఈ అమ్మడు. ఈ చిన్నది హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. తమిళ సినిమా "రిక్షా మామ" సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

శ్రీదేవి విజయ్ కుమార్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రభాస్ హీరోగా పరిచయం అయిన సినిమా ఈశ్వర్. ఇందులో కథానాయికగా శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో నిరీక్షణ సినిమాతో మరోసారి సినీప్రియులను మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోలతో మెప్పిస్తుంది ఈ చిన్నది. పలు టీవీ షోల్లో జడ్జ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
గతంలో శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్యూలో ఆమె ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ చాలా మంచి మనిషి, అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. అందుకే అతన్ని డార్లింగ్ అని పిలుస్తారు అని శ్రీదేవి తెలిపింది. ప్రభాస్ ఇతరులకు వడ్డించడం అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నతనం నుంచే ఉన్న లక్షణం, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇతరులు భోజనం తినడం చూసి సంతోషిస్తారని శ్రీదేవి తెలిపారు. ప్రభాస్ తాను ఎక్కువ ఆహారం తీసుకోకపోయినా, అతిథులు సంతృప్తిగా తినేలా చూస్తారని ఆమె తెలిపారు. ఆయన వంటకాల గురించి వివరించే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుందని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ స్వయంగా నాన్‌వెజ్ ప్రియుడని, ఆయనతో కలిసి భోజనం చేసిన రోజులు “కిడ్స్” లాగా చాలా సరదాగా గడిచాయని ఆమె చెప్పారు.
ప్రభాస్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ తనను శ్రీ లేదా పాప అని పిలిచేవారని, శ్రీదేవి అని ఎప్పుడూ పిలవలేదని తెలిపారు. ప్రభాస్ బాహుబలితో ఒక పాన్ ఇండియా స్టార్‌గా మారినప్పటికీ, తామింకా ఒకరితో ఒకరు టచ్‌లోనే ఉన్నామని శ్రీదేవి అన్నారు. ఆయన ఎదుగుదల పట్ల ఆమె ఎంతో గర్వంగా ఉందని శ్రీదేవి అన్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో ఆయన స్టార్‌డమ్ సాధించారని, ఇది ఆయన మంచితనానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమని ఆమె అన్నారు. ప్రభాస్ ప్రస్థానం ఒక అందమైన ప్రయాణమని, భవిష్యత్తులో ఆయన ఇంకా గొప్ప విజయాలు సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభాస్ సినిమాల ఎంపికపై మాట్లాడుతూ, ఆయన ఇమేజ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా, సాహో వంటి విభిన్న పాత్రలను ప్రయత్నించడం చాలా గొప్ప విషయమని శ్రీదేవి ప్రశంసించారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




