ఆయన పేరు నా గుండెల మీద ఎప్పటికీ ఉంటుంది.. పచ్చబొట్టుతో ప్రేమ కురిపించిన కిరాక్ ఆర్పీ
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. తన నెల్లూరి యాసతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు కిరాక్ ఆర్పీ.. కమెడియన్ చంటి టీమ్ లో స్కిట్స్ చేస్తూ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ సమయంలోనే ఆయన సినిమాలో ఆఫర్స్ కూడా అందుకున్నాడు.

సుమారు 450 పైగా స్కిట్‌లతో జబర్దస్త్ ప్రేక్షకులను అలరించాడు నటుడు కిరాక్ ఆర్పీ. జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లోను నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తన ప్రస్థానం జబర్దస్త్‌కు ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైందని తెలిపారు. మోహన్ బాబు కంపెనీలో మనోజ్ నటించిన రాజు భాయ్ , ఆ తర్వాత మంచి విష్ణు గేమ్ చిత్రానికి, అలాగే జగపతి బాబు, ప్రియమణి నటించిన గురుడు, సాధ్యం వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా అని తెలిపారు. ఆ తర్వాత శకలక శంకర్ ద్వారా జబర్దస్త్ లో ధనరాజ్ టీమ్‌కు రచయితగా చేరా అని తెలిపారు. అక్కడ ధనరాజ్ ప్రోత్సాహంతో రచయిత నుంచి ఆర్టిస్ట్‌గా మారి, సుమారు 550 నుండి 600 స్కిట్‌లలో నటించానని తెలిపారు కిరాక్ ఆర్పీ. రియాలిటీ షోలు, క్యాష్, జీన్స్ వంటి ఈవెంట్‌లలోనూ పాల్గొన్నా అన్నారు. తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వాటిలో “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” స్కిట్ ఒకటని. తన ప్రత్యేకమైన నెల్లూరు యాస (స్లాంగ్) వల్లే తాను ఇంతలా హిట్ అయ్యానని, అది అన్ని స్కిట్‌లకూ కొనసాగడానికి కారణమని ఆర్పీ పేర్కొన్నారు
అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..
ధనరాజ్ టీమ్‌లో 30 స్కిట్‌లు చేసిన తర్వాత ఆయన టీమ్ లీడర్‌గా ఎదిగా అని తెలిపారు. అయితే, ప్రస్తుత జబర్దస్త్ షో పరిస్థితిపై ఆర్పీ మాట్లాడుతూ.. గతంలో ఆర్కే రోజా, నాగ బాబు జడ్జ్‌లుగా ఉన్నారని, చంద్ర, గెటప్ శ్రీను, సుధీర్, హైపర్ ఆది వంటి 12 మంది టీమ్ లీడర్లు తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించేవారని గుర్తుచేసుకున్నాడు. చంద్ర కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేవారని, గెటప్ శ్రీను విభిన్న గెటప్‌లతో ఆశ్చర్యపరిచేవారని, సుధీర్ చరిష్మా, హైపర్ ఆది పంచులతో జబర్దస్త్ వెలిగిందని అన్నారు.
గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..
జబర్దస్త్ లో లేడీ గెటప్‌లు అప్పట్లో వినోద్, శాంతి స్వరూప్, తన్మయి వంటి అబ్బాయిలు లేడీ గెటప్‌లు వేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారని, వారికి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని అన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వారిని పిలిపించుకొని, వారి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, లిప్‌స్టిక్ వంటి వివరాలను అడిగి తెలుసుకునేవారని, అది అప్పట్లో ఒక అద్భుతం అని అన్నారు. అలాగే నాగబాబు గురించి మాట్లాడుతూ.. తనకు నాగబాబు అంటే ఎంతో ఇష్టమని ఆయన పేరును గుండెల పై పచ్చ బొట్టు వేయించుకున్నా అని తెలిపారు.. తనను నాగబాబు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు కిరాక్ ఆర్పీ.
చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




