చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్
ఆమె ఓ టాలీవుడ్ యాంకర్, బుల్లితెర నటి. పలు సీరియల్స్ లో నటించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ నటించి మెప్పించింది. అలాగే పలు టీవీ షోలకు యాంకర్ గానూ వ్యవహరించింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర పరిశ్రమాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో జరిగేవి మాత్రం ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. చాలా మంది హీరోయిన్స్, సింగర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా బయటపెడుతున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. చిన్నతనంలోనూ లైంగిక వేధింపులకు గురయ్యాం అని తెలిపి షాక్ ఇచ్చారు. తాజాగా ఓ యాంకర్ కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది. చూడటానికి పెద్ద మనిషిలా ఉండే ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పింది ఆ యాంకర్. ఇంతకూ ఆమె ఎవరంటే..
రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ
బుల్లి తెరపై తన అందంతో, యాంకరింగ్ తో మెప్పించిన యాంకర్స్ లో సమీరా ఒకరు. ఈ అమ్మడు పలు షోలతో పాపులర్ అయ్యింది. యంకర్‌గా, నటిగా తెలుగు బుల్లితెరను అలరించిన సమీరా షరీఫ్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ యాంకరమ్మ.. తన ఫ్యామిలీ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది. కాగా సమీర ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆమె తాను చిన్న తనంలో ఎదుర్కున్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు
సమీరా షరీఫ్ మాట్లాడుతూ.. చిన్నతనంలో తాము రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండేవాళ్లమని, ఎదురింట్లో నివసించే ఆంటీ వాళ్ల బంధువు ఒకరు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపింది. ఆ వ్యక్తి, మాములుగా పిల్లలను ముద్దు చేసే విధంగానే, తన బుగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టేవారని, బుగ్గలకి పప్పీలు ఇచ్చేవారని.. అప్పట్లో దాన్ని అమాయకపు ప్రేమగా భావించానని, అది ఏమిటో అర్థం కాలేదని అంది సమీర. ఆ వ్యక్తి దాగుడుమూతలు ఆడుకుందామని చెప్పి, ఎవరూ రాని టెర్రస్ మెట్ల వద్దకు తీసుకెళ్లి, అక్కడ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడేవాడని సమీరా తెలిపింది. మొదట్లో సరదాగా అనిపించినా, తర్వాత నెమ్మదిగా అసౌకర్యంగా అనిపించడం మొదలైందని ఆమె పేర్కొన్నారు. కాలక్రమేణా, పెద్దయ్యాక అది అసలు ప్రేమ కాదని, తనపై జరిగిన లైంగిక వేధింపు అని అర్థమైందని తెలిపింది సమీర. పిల్లలకు, తల్లిదండ్రులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అలాంటివి నేర్పించాల్సిన, వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సమీర చెప్పుకొచ్చింది.
అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




