Premi Vishwanath: ఆ డైరెక్టర్ వల్ల చాలా ఏడ్చాను.. ఆ ఘటన నా జీవితాన్ని మలుపు తిప్పింది.. ప్రేమీ విశ్వనాథ్..
ప్రేమీ విశ్వనాథ్.. ఈ పేరుతో కాకుండా వంటలక్క అంటే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. నటనపై ఆసక్తి లేకపోయినా, కుటుంబ స్నేహితుని సూచనతో ఆడిషన్‌కు వెళ్లిన ఆమె అనుకోకుండానే సీరియల్లో సెలక్ట్ అయ్యారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ దాదాపు ఏడేళ్లు నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగింది.

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి ప్రేమీ విశ్వనాథ్. ఈ సీరియల్లో వంటలక్క, దీప పాత్రతో సహజ నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా అలరిస్తుంది. నటి ప్రేమీ విశ్వనాథ్ “కార్తీకదీపం” సీరియల్‌తో తన నటన ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటనలోకి రాకముందు ఆమె మూడేళ్లపాటు న్యాయ సలహాదారుణిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు కార్తీకదీపంలో అవకాశం లభించింది. మొదట నటనపై ఆసక్తి లేకపోయినా, ఒక కుటుంబ స్నేహితుడు ప్రోత్సహించడంతో ఆడిషన్‌కు వెళ్లారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఆమెకు మొదట నటన పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నటన గురించి తనకు తెలియదని, చేయనని కూడా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే, ఒక కుటుంబ స్నేహితుడు ఆమెను ఆడిషన్‌కు వెళ్లమని ప్రోత్సహించారు. “వాళ్లకు టెలికాస్ట్ తేదీ దగ్గర పడింది, షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, ఒక్కసారి వెళ్లి చూడు” అని చెప్పడంతో, కేవలం ఆడిషన్ కోసమే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకున్నప్పుడు, హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది అమ్మాయిలు టెస్ట్‌కు వచ్చారని, అయితే దర్శకుడికి ఎవరూ సరిపోలేదని, ముఖ్యంగా తెల్లని చర్మం ఉన్న అమ్మాయిలు బ్లాక్ మేకప్ వేసినప్పుడు సహజత్వం లోపించిందని తెలుసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
ఆడిషన్ ప్రారంభంలో దర్శకుడు అంజు ఆమెకు ఒక విచిత్రమైన పనిని ఇచ్చారు. ముందుగా ఒక చీపురుకట్ట ఇచ్చి, క్లీనింగ్ చేయమని చెప్పారు. ఇంటి వద్ద చేసే క్లీనింగ్ లాగానే సహజంగా చేయాలని సూచించారు. ప్రేమీ విశ్వనాథ్ దానిని చాలా సహజంగా చేశారు. దర్శకుడు ఆమెలోని ఆ సహజత్వాన్ని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత మేకప్ వేసి, చీర కట్టుకొని స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్‌లో భాగంగా ఆమెకు ఒక భావోద్వేగ సన్నివేశాన్ని ఇచ్చారు. అది ఒక ఏడుపు సీన్. అత్తగారు తిడుతుండగా, దేవాలయానికి వెళ్లేందుకు అడ్డంగా నిలబడిన ఒక నల్లని పాత్ర అది. ఆ సమయంలో ప్రేమీ విశ్వనాథ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి, నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె నిజాయితీతో కూడిన నటనకు దర్శకుడు చాలా ఆకట్టుకున్నారు. “ఆమెకు నిజంగానే కోపం వచ్చి ఏడుపొచ్చిందని వాళ్లకు తెలీలేదు” అని నవ్వుతూ చెప్పారు. ఇలా ఆమె తన తొలి నటన అనుభవంతోనే “కార్తీకదీపం”లో ఎంపికై, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన, విజయవంతమైన మలుపును సూచిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
