Movies : డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..

ఇప్పటివరకు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో పాటు అన్ని భాషల్లో భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని బడా సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు రానున్న సినిమాల్లో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు.

Movies : డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
Movie Heros
Follow us

|

Updated on: Apr 16, 2024 | 12:03 PM

సినిమా రేంజ్ రోజు రోజుకు పెరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటివరకు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో పాటు అన్ని భాషల్లో భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని బడా సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు రానున్న సినిమాల్లో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్‌లో అదరగొట్టనున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

డ్యూయల్ రోల్ లో నటించడానికి రెడీ అవుతున్న హీరోల్లో ముందుగా సూర్య గురించి చెప్పుకోవాలి. తమిళ సూపర్ స్టార్ సూర్య ‘కంగువ’ సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. ఇందులో సూర్య అదరగొట్టేశాడు., బాబీ డియోల్ డేంజరస్ స్టైల్ చూసి గూస్‌బంప్స్‌కి గురయ్యారు ఆడియన్స్. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాకి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా( ఏప్రిల్ 15న)సూర్య పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ చిత్రంలో సూర్య రెండు పాత్రల్లో కనిపించాడు. ఒకటి 500 ఏళ్లనాటి లుక్ కాగా మరొకటి నేటి కాలానికి సంబంధించింది. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఎన్టీఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ ఏడాది దేవర1 చిత్రంతో ఆడియన్స్ ను అలరించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా  కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  300 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌,  టీజర్‌లలో తారక్ ఒక్క లుక్ లోనే కనిపిస్తున్నాడు. సెకండ్ పార్ట్ లో డిఫరెంట్ స్టైల్ లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే  జూనియర్ ఎన్టీఆర్ యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ చిత్రం ‘వార్ 2’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు తారక్. ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్టు బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ఒకటి నెగెటివ్ కాగా మరొకటి పాజిటివ్ రోల్స్ ఉంటాయట. ఈ పాత్రలలో ఒకటి ఇంట్రవెల్ తర్వాత ప్రారంభమవుతుందని అంటున్నారు.

దళపతి విజయ్

దళపతి విజయ్ త్వరలో నటనకు గుడ్ బై చెప్పనున్నారని కోలీవుడ్ టాక్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) తర్వాత ఒక్క సినిమా చేసి నటనకు గుడ్ బై చెప్పనున్నారట విజయ్. గోట్ తర్వాత 1000 కోట్లతో ఓ సినిమాలో నటించనున్నాడట. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రివీల్ చేసిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ పోస్టర్లన్నింటిలోనూ విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు. ఇద్దరి పాత్రల వయసులోనూ చాలా తేడా ఉంటుంది. ఒక లుక్‌లో విజయ్‌ యంగ్‌గా కనిపిస్తే, మరో లుక్‌లో పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్,  టైమ్ ట్రావెలింగ్ మూవీ అని టాక్.

రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ కనిపించనుంది. సినిమా తీయడం ప్రారంభించినప్పుడు దాని బడ్జెట్ 250 కోట్లు.ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ ‘గేమ్ ఛేంజర్’ బడ్జెట్ రూ.450 కోట్లకుచేరిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. తండ్రీ కొడుకులిద్దరి పాత్రల్లో చరణ్ నటించబోతున్నాడు.

కమల్ హాసన్

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో రాబోతున్నారు. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇండియన్’కి ఇది సీక్వెల్. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శంకర్‌, కమల్‌హాసన్‌లు 27 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 13న థియేటర్లలోకి రానుంది. కమల్ ఇండియన్ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించాడు. అయితే ఈ సినిమాలో కూడా రెండు పాత్రల్లో నటిస్తాడా అనేది  తెలియాల్సి ఉంది. సినిమాలో కమల్ లుక్ చూసి అందరూ షక్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.