04 January 2026
హీరోయిన్ మెటీరియల్ బాసూ.. అయినా సైడ్ క్యారెక్టర్స్ ఇస్తున్నారేంటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తెలుగమ్మాయి దివ్ వద్త్య. నటిగా, మోడల్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే.
అందంతోపాటు నటనతో, ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకుంటుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటుంది.
2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మహర్షితో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఇందులో చిన్న పాత్రలో కనిపించింది దివి.
కానీ తన అందంతో, స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది దివి.
తక్కువ రోజుల్లోనే బయటకు వచ్చేసింది. తర్వాత 'A1 ఎక్స్‌ప్రెస్', లంబసింగి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది ఈ బ్యూటీ.
మంచి హైట్, ఫిజిక్ ఉండి.. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ తెలుగులో మాత్రం కథానాయికగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు.
బిగ్ బాస్ షోతో పాపులారిటీ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. వరుసగా క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇప్పుడు లేటేస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్