కవ్విస్తున్న కుర్ర భామ రుక్మిణి వసంత్.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు 

5  January 2026

Pic credit - Instagram

Rajeev 

కాంతారా 1 తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో టాపిక్ గా మారింది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్

కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది రుక్మిణి 

ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రుక్మిణి తన నటనతో ఆకట్టుకుంది. 

బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.

తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. 

ఇటీవలే కాంతార సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది రుక్మిణి. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. 

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ వయ్యారి భామ.