Cinema : ఇంటిని తాకట్టు పెట్టి, భార్య నగలను అమ్మి తీసిన సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా..
సినిమా ప్రపంచంలో సక్సెస్ కావడం అనేది అంత సులభం కాదు. నటీనటులతోపాటు.. దర్శకులకు సైతం టాలెంట్ తోపాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. ఇప్పటికీ చాలా మంది దర్శకులు ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఒక్క సినిమా తెరకెక్కించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన సినిమాను రూపొందించారు. కట్ చేస్తే.. బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టారు.

ప్రస్తుతం సినీరంగంలో సక్సె్స్ అయిన దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క సినిమాను రూపొందించేందుకు వారంతా ఎదుర్కొనే సవాళ్లు ఎలా ఉంటాయో వాళ్లకు మాత్రమే తెలుసు. ప్రతిభ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో విజయం సాధించడం అంత సులభం కాదు. కానీ ఓ దర్శకుడు మాత్రం అనేక కష్టాలు ఎదురైనా ప్రతిభను నమ్ముకుని సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తాను నమ్మిన కథ కోసం ఇంటిని తాకట్టు పెట్టాడు. భార్య నగలను అమ్మేసి సినిమాను పూర్తి చేశాడు. కట్ చేస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. ఏకంగా ఆ మూవీ రూ.300 కోట్లు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఆ సినిమా పేరు మహావతార్ నరసింహ. ఈ మూవీని రూపొందించిన దర్శకుడు అశ్విన్ కుమార్. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. 2025లో చరిత్ర సృష్టించిన సినిమా ఇది. గతేడాది జూలై 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, విజువల్స్ జనాలను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకుపోయింది. సెప్టెంబర్ 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సత్తా చాటింది ఈ మూవీ.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
అయితే ఈ సినిమాను పూర్తి చేసే సమయంలో దర్శకుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. తన ఇంటిని తాకట్టు పెట్టాడట. అలాగే తన భార్య నగలను సైతం అమ్మేశాడట. దాదాపు 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ సృష్టించింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషలలోనూ ఈ సినిమా రాణించింది. విష్ణువు నరహింహ అవతారం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
