బాలయ్య బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా చేసింది ఈ చిన్నారి.. ఎవరో గుర్తుపట్టారా..?

ఒకప్పుడు బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే ఎనో చిత్రాల్లో నటించారు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇదిలా ఉంటే పై ఫొటోలో బాలయ్య బాబుతో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ ఫెమస్ హీరోయిన్. ఒకప్పుడు కుర్రకారును ఊపేసింది ఆమె.. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు ఆ హీరోయిన్.

బాలయ్య బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా చేసింది ఈ చిన్నారి.. ఎవరో గుర్తుపట్టారా..?
Balakrishna
Follow us

|

Updated on: Apr 16, 2024 | 12:42 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిని మెప్పించారు. బాలకృష్ణ చేయని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎనో అద్భుతమైన సినిమాలు చేశారు బాలయ్య. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఒకప్పుడు బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే ఎనో చిత్రాల్లో నటించారు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇదిలా ఉంటే పై ఫొటోలో బాలయ్య బాబుతో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ ఫెమస్ హీరోయిన్. ఒకప్పుడు కుర్రకారును ఊపేసింది ఆమె.. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు ఆ హీరోయిన్.

అంతే కాదు  బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి ఆతర్వాత బాలయ్య సరసన కూడా నటించింది. ఇంతకు ఏ ఎవరంటే.. బాలయ్య బాబుతో ఉన్న ఆ చిన్నారు . సీనియర్ హీరోయిన్ రాశి. బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ వచ్చిన బాలగోపాలుడు సినిమాలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే పై ఫొటోలో బాలయ్య పక్కన ఉంది కళ్యాణ్ రామ్.

ఆతర్వాత బాలకృష్ణ ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ బాబు సినిమాలో బాలకృష్ణ సరసన రాశి  నటించారు. రాశి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టించి మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి దాదాపు అందరు టాలీవుడ్ హీరోలతో నటించింది. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. అలాగే సీరియల్స్ లోనూ నటిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Rashi

 రాశి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్