Video : ఇదెక్కడి మాస్ రా మావా..! ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
జూలు విదిలించి .. బ్యాట్ ఝుళిపించాడంటే బాలు గాలిలో తేలుతూ సిక్స్ వెళ్లాల్సిందే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న ధోని ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆతని ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఈ ఐపీఎల్ లో ధోని బ్యాటింగ్ కు వచ్చింది తక్కువే కానీ.. దిగిన ప్రతిసారి అభిమానులకు ఆకట్టుకునేలా షాట్స్ కొట్టి అదరగొట్టాడు.
టీమ్ లో ఎంతమంది ఉన్న .. ధోనికి ఉండే క్రేజ్ వేరబ్బా.. ధోని గ్రౌండ్ లోకి దిగుతున్నదంటే చాలు స్టేడియం మొత్తం ఉగిపోతుంది. జూలు విదిలించి .. బ్యాట్ ఝుళిపించాడంటే బాలు గాలిలో తేలుతూ సిక్స్ వెళ్లాల్సిందే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న ధోని ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆతని ప్లేస్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఈ ఐపీఎల్ లో ధోని బ్యాటింగ్ కు వచ్చింది తక్కువే కానీ.. దిగిన ప్రతిసారి అభిమానులకు ఆకట్టుకునేలా షాట్స్ కొట్టి అదరగొట్టాడు. తాజాగా ఆదివారం రోజున చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోనినే హైలైట్..
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ లో ధోని మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఇన్నింగ్స్ చివరి నాలుగు బాల్స్ ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్ కు దిగాడు. ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టడంతోనే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. మ్యాచ్ జరిగింది ముంబైలో అయినా స్టేడియం మొత్తం ధోని పేరుతో మారుమ్రోగింది.
మొదటి బాల్‌ను ధోని అద్భుత షాట్ ఆడి సిక్స్ మలిచాడు. దాంతో స్టేడియం మొత్తం హోరెత్తింది. ఆ వెంటనే రెండో బంతిని కూడా సిక్స్ కొట్టాడు ధోని.. అంతటితో ఆగకుండా మూడో బంతిని కూడా బౌండరీ దాటించి సిక్స్ గా మలిచాడు .. ఇలా వరుసగా మూడు సిక్స్ లు బాది హ్యటిక్స్ సాధించాడు. అయితే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు బాలీవుడ్ తారలు కూడా స్టేడియంకు వచ్చారు. ముంబై టీమ్ గెలవాలని గట్టిగానే కోరుకున్నారు. ముంబై జెండాలు పట్టుకొని నినాదాలు కూడా చేశారు. కానీ ధోని ధాటికి ముంబై తారలు బిత్తర పోయారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్, నేహా ధుపియా కూడా ధోని సిక్స్ లు చూసి షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫొటోలు సోహాల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలకు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..