Animal Movie: యానిమల్ మూవీ.. సమాజాన్ని పదేళ్లు వెనక్కు తీసుకెళ్తుంది.. బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్..

మొన్నటివరకు జావేద్ అక్తర్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా మధ్య ఓ రేంజ్ మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకీర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. యానిమల్ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కు తీసుకెళ్తుందని అన్నారు. ఇలాంటి సినిమా తీయకూడదని.. హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు.. కానీ సినిమాకు కొంత సామాజిక విలువ ఉండాలని.. లేదా ప్రజలు ఆర్థిక విలువ కోసమే పని చేస్తున్నారా ? అని అన్నారు. ప్రస్తుతం వికాస్ దివ్యకీర్తి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి

Animal Movie: యానిమల్ మూవీ.. సమాజాన్ని పదేళ్లు వెనక్కు తీసుకెళ్తుంది.. బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్..
Vikas Divyakirti, Animal Mo
Follow us

|

Updated on: Apr 16, 2024 | 2:30 PM

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా యానిమల్. ఈ మూవీపై ఎంతగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో.. అంతకు మించి విమర్శలు కూడా నచ్చాయి. ఈ సినిమాపై ఎంతో మంది సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బహిరంగంగానే డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు. మొన్నటివరకు జావేద్ అక్తర్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా మధ్య ఓ రేంజ్ మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకీర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. యానిమల్ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కు తీసుకెళ్తుందని అన్నారు. ఇలాంటి సినిమా తీయకూడదని.. హీరో జంతువులా ప్రవర్తిస్తాడని చూపించారు.. కానీ సినిమాకు కొంత సామాజిక విలువ ఉండాలని.. లేదా ప్రజలు ఆర్థిక విలువ కోసమే పని చేస్తున్నారా ? అని అన్నారు. ప్రస్తుతం వికాస్ దివ్యకీర్తి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

“యానిమల్ లాంటి సినిమా మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటి సినిమా తీయకూడదు. మీరు డబ్బు సంపాదించారు. మీ హీరో జంతువు జంతువులా ప్రవర్తిస్తున్నాడని చూపించారు. అయితే ఇందులో ఎక్కడో సామాజిక విలువలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసమే పని చేస్తారా” అని అన్నారు. “అలాగే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తన ప్రియురాలిగా కనిపించిన త్రిప్తిని తన బూట్లు నొక్కమని హీరో అడిగాడు. ఈ సీన్ చూసిన తర్వాత రేపటి తరం ఇలాగే ప్రవర్తిస్తే.. ఇంత అసభ్యకరమైన సినిమా చూస్తున్నందుకు బాధేస్తుంది ” అని అన్నారు. ప్రస్తుతం వికాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.

వికాస్ దివ్యకీర్తిని ఐఏఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ’12వ ఫెయిల్’ సినిమాలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడి పాత్రలో నటించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.