AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: నేనెప్పుడు అలా చేయలేదు.. అది ఫేక్ వీడియో.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో..

తాజాగా అమీర్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన అమీర్ ఖాన్ ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల సినీ కెరీర్‏లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.

Aamir Khan: నేనెప్పుడు అలా చేయలేదు.. అది ఫేక్ వీడియో.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో..
Aamir Khan
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2024 | 3:28 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‏తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన అమీర్ ఖాన్ ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల సినీ కెరీర్‏లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.

ప్రస్తుతం తాను రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న వీడియో వైరలవుతుందని.. అది పూర్తిగా ఫేక్ వీడియో అని అన్నారు. దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత ఎన్నికలలో ఎన్నికల సంఘం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అమీర్ ఖాన్ ఫలానా రాజాకీయ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో నకిలిదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం అమీర్ ఖాన్ ఓ సందేశం ఇచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎన్నికలలో చురుకుగా ఉండాలని అన్నారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియో మాత్రం ఆర్టిఫిషియేల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందన్నారు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించనున్న లాహోర్:1947 చిత్రంలో నటించనున్నారు. ఇందులో జెనీలియా డిసౌజా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే