AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: దొరికేసింది మావ..! పుష్ప 2 జాతర సీన్‌లో ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.! ఆమె ఎవరంటే

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ లోనూ ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతుంది.

Pushpa 2: దొరికేసింది మావ..! పుష్ప 2 జాతర సీన్‌లో ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.! ఆమె ఎవరంటే
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2024 | 7:08 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మాటే వినిపిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. 2021లో విడుదలైన పుష్ప సినిమా భారీ హిట్ గా నిలిచిందని. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదలై విశేషంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదలైన పుష్ప 2 సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజే రికార్డ్ స్థాయి ఓపినింగ్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?

ఇక పుష్ప సినిమా చూసిన అందరూ అల్లు అర్జున్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించి మెప్పించారని అంటున్నారు. పుష్ప 2 సినిమాకు జాతర ఎపిసోడే హైలైట్ అంటున్నారు. ఇక పుష్ప 2 సినిమాలో చాలా మంది నటించి మెప్పించారు. జాతర ఎపిసోడ్ లోను చాలా మంది నటించి ఆకట్టుకున్నారు. తాజాగా సినిమాలో నటించిన ఓ చిన్నదాని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పై ఫొటోలో ఉన్న చిన్నదాన్ని చూశారా.?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.

జాతర ఎపిసోడ్ లో సైడ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆమె పేరు పూజిత రెడ్డి. ఈ చిన్నది పలు సినిమాలు, సీరియల్స్ లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదానికి నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ లో రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ ను, కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా పుష్ప2 సినిమాలో తాను కూడా నటించాను అని చెప్తూ ఫోటోలు షేర్ చేసింది. పుష్ప 2 సీన్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది పూజిత రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్