Pushpa 2: ఇదీ పుష్పగాడి రేంజ్.. ఇక మిగిలింది ఆ ఒక్క రికార్డే..!
Pushpa 2 Box Office Collections: దేశంలో పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. భారీ రికార్డుపై పుష్పరాజ్ కన్నేశాడు. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేరింది పుష్ప 2. కలెక్షన్స్ పరంగా తాను అనుకున్నది సాధించి చూపించాడు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఆ ఒక్క రికార్డు మాత్రమే పుష్పరాజ్‌ను ఊరిస్తోంది.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియానే కనిపిస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన అల్లు అర్జున్ (Allu Arjun).. అనుకున్నది సాధించి చూపించారు. బిగ్గెస్ట్ హిట్ పక్కా అన్న కాన్ఫిడెన్స్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 (Pushpa 2) అదే రేంజ్ లో పర్ఫామ్ చేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ సినిమా మరిన్ని రికార్డులు టార్గెట్ చేస్తోంది. దీంతో పుష్పరాజ్ ఫైనల్ టార్గెట్ ఏంటన్న విషయం మీదే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న బిగ్గెస్ట్ కలెక్షన్ రికార్డ్ బాహుబలి 2 మూవీదే. నెంబర్ పరంగా దంగల్ కాస్త ముందున్న అది సింగిల్ రిలీజ్లో సాధించిన మొత్తం కాదు. అందుకే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా బాహుబలి 2దే అగ్రస్థానం. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అప్పటి వరకు ఇండియా సినిమా ఊహించిన స్థాయికి చేరింది బాహుబలి 2. ఈ సక్సెస్ తరువాత అన్ని ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా మూవీస్ తెర మీదకు వచ్చాయి.
బాహుబలి బాటలో చాలా మంది బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. కానీ వసూళ్ల పరంగా మాత్రం బాహుబలి 2 రేంజ్ ను అందుకోలేకపోయారు. దీంతో ఏడుళ్లుగా ఇండియాస్ హయ్యస్ట్ గ్రాసర్ అన్న రికార్డ్ బాహుబలి 2 పేరిటే ఉంది. ఆ తరువాత భారీ విజయం సాధించిన సినిమాల రికార్డ్లన్నింటినీ నాన్ బాహుబలి రికార్డులుగానే పరిగణిస్తున్నారు. ఫైనల్ గా బాహుబలి 2 రికార్డ్ లను తిరగరాసే సత్తా ఉన్న సినిమాగా పుష్ప 2ను చూస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.
పుష్ప 2తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు అల్లు అర్జున్. డే వన్ నుంచే వసూళ్ల రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 ఆల్రెడీ తొలి వారం అన్ని రికార్డులను తిరగరాసింది. ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసింది. దీంతో ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తుందా అన్న డిస్కషన్ జరుగుతోంది. ఆ అవకాశం కూడా చాలా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
బాహుబలి రిలీజ్ టైమ్ లో ఉన్న టికెట్ రేట్స్ తో పోల్చుకుంటే పుష్ప 2 విషయంలో ఉన్న టికెట్ రేట్స్ చాలా ఎక్కువ. సో వసూళ్ల పరంగా అది పుష్ప2కి హెల్ప్ అవుతుంది. నార్త్ లో పుష్ప క్రేజ్ కూడా ఈ సినిమాను రూ.1800 కోట్ల మార్క్ ను దాటిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు మాలీవుడ్ లోనూ బన్నీకి సాలిడ్ బేస్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే అతి త్వరలో పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని లెక్కలేస్తున్నారు.