Tollywood: అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో.. ఒక్క ఇంటర్వ్యూతో..
సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోస్ చేసి ఫేమస్ అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్ ద్వారా పాపులర్ అయి ఇప్పుడు సినీరంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.

టిక్ టాక్ వీడియోస్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అమెరికాలో లక్షల్లో జీతం వస్తున్న జాబ్ మానేసి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే అషు రెడ్డి. అమెరికాలో ఉంటూ టిక్ టాక్ వీడియోస్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో ఇండియాకు వచ్చింది. ఈ షో కంటే ముందే తెలుగులో ఓ సినిమా చేసిందని మీకు తెలుసా.. ? విశాఖపట్నంకు చెందిన అషు రెడ్డి.. MBAలో HR మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది.
ఆ తర్వాత అమెరికాలో కొన్నాళ్లపాటు లక్షల జీతానికి వర్క్ చేసింది. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు టిక్ టాక్ వీడియోస్ చేసి నెట్టింట ఫేమస్ అయ్యింది. అప్పుడే పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఉన్న నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగా సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అమెరికాలో షూటింగ్ కావడంతో ఆ సినిమాలో నటించానని.. జాబ్ వదిలేసి ఏదైనా చేయాలని అనుకున్నానని.. ఆ మూవీ రిలీజ్ అయ్యాకే బిగ్ బాస్ రియాల్టీ షోలో ఛాన్స్ వచ్చిందని.. దీంతో ఇండియాకు తిరిగి వచ్చానని తెలిపింది.
ఛల్ మోహన్ రంగ సినిమాలో అమెరికాలో ఉండే పలు సీన్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ లా కనిపిస్తుంది అషు రెడ్డి. 2018లో ఛల్ మోహన్ రంగ సినిమా రిలీజ్ కాగా.. 2019లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అషు. ప్రస్తుతం ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ.. అటు బుల్లితెరపై పలు రియాల్టీ షోస్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




