Court Movie OTT: ఓటీటీలోకి కోర్ట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన సంస్థ..
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కోర్డ్. చిన్న మూవీగా అడియన్స్ ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా కోర్ట్. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతోపాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోహణ్, శ్రీదేవి, శివాజీ కీలకపాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అడియన్స్ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శివాజీ, ప్రియదర్శి అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు లభించాయి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారట. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. హీరో నాని సమర్పించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోర్ట్ సినిమా థియేటర్లలో తెలుగు భాషలోనే రిలీజ్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈసినిమా దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి :