Kamal Haasan: ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్.. ఊహించని పాత్రలో లోకనాయకుడు ?..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kamal Haasan: ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్.. ఊహించని పాత్రలో లోకనాయకుడు ?..
Prabhas, Kamal Haasan
Follow us

|

Updated on: May 30, 2023 | 8:34 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూ్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ నటించనున్నారట. అది కూడా సినీ ప్రియులు ఇప్పటివరకు ఊహించని పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ హసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారట. ఈ రోల్ చేయడానికి ఏకంగా రూ. 150 కోట్లు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట మేకర్స్. అయితే ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ సినిమాలో కమల్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని.. విలన్ రోల్ చేయడానికి కమల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిదే న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభాస్ సినిమాలో కమల్ భాగమవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుండగా.. మొదటిసారి ప్రతినాయకుడిగా కమల్ నటించడంతో ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ ఓటీటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటీటీల గురించి కొన్ని సంవత్సరాల ముందే తాను చెప్పానని.. ఆ సమంయలో ఇండస్ట్రీలోని వాళ్లెవ్వరూ తన మాటలు పట్టించుకోలేదని అన్నారు. తన ఆలోచనలను అంగీకరించలేదని.. ఈరోజు వారికి అర్ధమైందని.. ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా అన్ని భాషల్లోని సినిమాలు చూస్తున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.