Kalki 2898 AD: హైదరాబాద్‌లో ల్యాండైన ప్రభాస్ ‘బుజ్జి’.. ఈ థియేటర్‌కు వెళితే డైరెక్టుగా చూడొచ్చు

ప్రభాస్ కల్కి సినిమాలో భైరవుడి బుజ్జి రోల్ కూడా చాలా కీలకమైనదే. బుజ్జి పరిచయం కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ తర్వాత కల్కి ప్రమోషన్లలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బుజ్జిని తిప్పారు. నాగచైతన్య, ఆనంద్ మహీంద్రా, నారాయణ్ కార్తికేషన్, రిషభ్ శెట్టి లాంటి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ బుజ్జిని డ్రైవ్ చేశారు.

Kalki 2898 AD: హైదరాబాద్‌లో ల్యాండైన ప్రభాస్ 'బుజ్జి'.. ఈ థియేటర్‌కు వెళితే డైరెక్టుగా చూడొచ్చు
Prabhas Bujji
Follow us

|

Updated on: Jun 27, 2024 | 1:40 PM

ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి సినిమా పేరే వినిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభాస్ అభిమానుల హంగామా మాములుగా లేదు. తెల్లవారు జామున స్టార్ట్ అయ్యే షోల కోసం అర్ధ రాత్రి నుంచే థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు. కాగా ప్రభాస్ కల్కి సినిమాలో భైరవుడి బుజ్జి రోల్ కూడా చాలా కీలకమైనదే. బుజ్జి పరిచయం కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ తర్వాత కల్కి ప్రమోషన్లలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో బుజ్జిని తిప్పారు. నాగచైతన్య, ఆనంద్ మహీంద్రా, నారాయణ్ కార్తికేషన్, రిషభ్ శెట్టి లాంటి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ బుజ్జిని డ్రైవ్ చేశారు. ఇలా దేశంలోని పలు ప్రాంతాలను చుట్టేసిన బుజ్జి ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకుంది. గురువారం కల్కి సినిమా విడుదల సందర్భంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ నిర్వాహకులు బుజ్జిని ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.

ఫొటోస్ వైరల్

దీంతో కల్కి సినిమాను చూసేందుకు వచ్చిన సినీ ప్రేక్షకులు బుజ్జిని కూడా చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మూవీ లవర్స్ కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ కు ఎగబడుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ల్యాండ్ అయిన బుజ్జి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరి మీరు కూడా బుజ్జిని డైరెక్టుగా చూడాలనుకుంటున్నారా? మరెందుకు లేటు.. వెంటనే ప్రసాద్ మల్టీప్లెక్స్ కు వెళ్లండి.

ఇవి కూడా చదవండి

ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ఆవరణలో ‘బుజ్జి’..

ఇక కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమలహాసన్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టారాది స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, దర్శక ధీరుడు రాజమౌళి తదితరులు క్యామియో రోల్స్ లో సందడి చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?