Kalki 2898 AD Review: కల్కి 2898 ఏడీ రివ్యూ.. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుత ప్రపంచం..

కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Kalki 2898 AD Review: కల్కి 2898 ఏడీ రివ్యూ.. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుత ప్రపంచం..
Kalki 2898 AD Review
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jun 27, 2024 | 11:19 AM

మూవీ రివ్యూ: కల్కి 2898 ఏడీ

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ, పశుపతి, శోభన తదితరులు

సినిమాటోగ్రఫీ: డీజోర్డ్జే స్టోజికోవిక్

సంగీతం: సంతోష్ నారాయనణ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: నాగ్ అశ్విన్

నిర్మాత: సి అశ్వినీ దత్

కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

కురుక్షేత్ర యుద్ధం జ‌రిగిన 6 వేల ఏళ్ళ తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది.. అధ‌ర్మంతో మరో ప్రపంచాన్ని తనకోసం సృష్టించుకుని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుంటాడు సుప్రీమ్ యస్కిన్ (కమల్ హాసన్). యాస్కిన్ అన్యాయాల‌పై శంబాల అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తుంటారు కొందరు రెబెల్స్. కాలక్రమేనా మనుషులు ప్ర‌కృతిని నాశ‌నం చేస్తుండటంతో.. కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తాడు యస్కిన్. అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి వెళ్లాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అందులో భైర‌వ (ప్ర‌భాస్‌) కూడా ఒక‌డు. కాంప్లెక్స్‌లోకి వెళ్ల‌ల‌న్న‌ది అత‌డి క‌ల‌. మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మ‌ళ్లీ క‌ల్కి అవ‌తారంలో జన్మిస్తారని శంబాలా ప్ర‌జ‌లు న‌మ్ముతుంటారు. తమ దేవుడికి జ‌న్మ‌నిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు.. సుమ‌తి (దీపికా ప‌దుకొనే) కనిపిస్తుంది. ఆమె యస్కిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది. సుమ‌తిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్‌లోకి ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని క‌మాండ‌ర్ మాన‌స్‌ (శ‌శ్వ‌తా ఛ‌ట‌ర్జీ) భైర‌వ‌తో ఒప్ప‌దం కుదుర్చుకుంటాడు. అప్పుడు భైరవ బారి నుంచి సుమ‌తిని రక్షించే బాధ్యతను అశ్వ‌త్థామ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) తీసుకుంటాడు. అసలు అశ్వద్ధామ ఎక్కడ్నుంచి వచ్చాడు..? కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6 వేల ఏళ్ళ తర్వాత కూడా అశ్వద్ధామ ఎలా బతికి ఉంటాడు..? ఆయనేం చేసాడు..? సుమతిని ఎలా కాపాడాడు.. శంబాల ప్రజల్ని కాపాడాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని.. మన పురాణాలకు లింక్ పెడుతూ.. రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది సక్సెస్ అయ్యిందా లేదంటే సాగదీసాడా ఇవన్నీ పక్కన పెడితే.. ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారంటీ. సినిమా మొదటి 15 నిమిషాలు అద్భుతంగా మొదలైంది. ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ గానే ముందుకు సాగింది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగ్ అశ్విన్. అశ్వద్ధామ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రిఫరెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. రొటీన్ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం కల్కి అందరికీ నచ్చదు. అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్న వాళ్లకు మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతం. రెండు ప్రపంచాలను లింకు పెడుతూ ఇలాంటి కథ రాసుకోవడమే చాలా కాంప్లికేటెడ్. అందుకే నాగ్ అశ్విన్ కూడా స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కాస్త తడబడినట్టు అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్ ల లెంత్ పెంచాడు దర్శకుడు. బుజ్జి, భైరవ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ లేదు.. అతడి జోడి బుజ్జినే. సినిమా అంతా ఒకెత్తు అయితే.. మొదటి, చివరి 15 నిమిషాలు మరొక ఎత్తు. క్లైమాక్స్ అయితే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే.. మాటల్లేవు. ఫస్టాఫ్ కారెక్టర్స్ ఇంట్రోస్ కోసం చాలా నెమ్మదిగి సాగింది. దానికితోడు ప్రభాస్ సీన్స్ కూడా పెద్దగా అనిపించవు. దిశా పటానీ, ప్రభాస్ ఎపిసోడ్ కూడా అంతగా ఎక్కలేదు.. అదేదో టైమ్ పాస్ కోసం పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. ముఖ్యంగా దేవుడి రిఫరెన్స్ తీసుకున్న ప్రతీసారి అదరగొట్టాడు నాగ్ అశ్విన్. చివరి 15 నిమిషాలు కూడా సినిమా ఆ స్థాయికి వెళ్లడానికి అదే కారణం.

నటీనటులు:

ప్రభాస్ మరోసారి అదరగొట్టాడు.. కామెడీ పోర్షన్ కూడా తనే తీసుకున్నాడు. సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో కనిపించే ప్రభాస్ మరో ఎత్తు. ఈ సినిమాకు అసలైన హీరో అమితాబ్ బచ్చన్.. ఆయన కాకుండా అశ్వద్ధమగా ఇండియాలో ఇంకే నటుడు సరిపోడు. కథను తన భుజాలపై మోసాడు బిగ్ బి. కమల్ హాసన్ ఉన్నది కాసేపైనా మ్యాజిక్ చేశాడు. దీపికా పదుకొనే క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కామియోస్ బాగున్నాయి. మానస్‌గా శశ్వతా ఛటర్జీ యాక్టింగ్ బాగుంది. పశుపతి, శోభన సహా మిగిలిన వాళ్ళంతా ఓకే..

టెక్నికల్ టీం:

కల్కి సినిమాకు ప్రాణం నేపథ్య సంగీతం. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా నెక్ట్స్ లెవల్ అంతే. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియాకు ది బెస్ట్ సినిమా ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ విషయంలో నూటికి 100 మార్కులు వేయొచ్చు కల్కి 2898 సినిమాకు. తన ఇమాజినేషన్‌కు సరైన రూపం ఇచ్చాడు. ఎడిటింగ్ కాస్త వీక్ అనే చెప్పాలి. అయితే కథను నడిపించే క్రమంలో ఆ స్లో నెస్ తప్పదు కాబట్టి దర్శకుడిని కూడా తప్పు బట్టలేం. దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఆలోచనలు అద్భుతం. దాన్ని ఆయన సాకారం చేసుకున్నారు కూడా. అంత కాంప్లికేటెడ్ కథను చాలా బాగా చెప్పాడు ఈ దర్శకుడు. టెక్నికల్ గా కల్కికి తిరుగులేదు. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. అల్లుడిపై నమ్మకంతో అశ్వినీదత్ చాలా బాగా ఖర్చు చేసారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా కల్కి 2898 ఏడి.. సరికొత్త విజువల్ ప్రపంచం..

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?