- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD Director Nag Ashwin Shares His Torn Slipppers photo showing Dedication for making it
Director Nag Ashwin: రూ.600 కోట్ల సినిమా తెరకెక్కించి అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్.. నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. రూ.4 వేల జీతంతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు రూ.600 కోట్లతో సినిమా తెరకెక్కించేస్థాయికి ఎదిగారు. చిన్నప్పటి నుంచి మీడియా, కథనాలు, వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగ్ అశ్విన్ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన నాగ్ అశ్విన్.
Updated on: Jun 27, 2024 | 10:54 AM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. రూ.4 వేల జీతంతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు రూ.600 కోట్లతో సినిమా తెరకెక్కించేస్థాయికి ఎదిగారు. చిన్నప్పటి నుంచి మీడియా, కథనాలు, వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగ్ అశ్విన్ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన నాగ్ అశ్విన్.. ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డ్స్ అందుకున్నాడు.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూ. 600 కోట్లతో కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రూపొందించాడు నాగ్ అశ్విన్.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కల్కి కోసమే చర్చ నడుస్తోంది. కల్కి ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ముక్కలుగా ఊడిపోయి.. అరిగిపోయిన తన చెప్పుల ఫోటోలను షేర్ చేస్తూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.

చాలా దూరం నడిచా.. ఇక్కడికి దాకా రావడానికి అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డట్లు పరోక్షంగా తెలిపారు. ఇటీవల విడుదలైన ప్రీ లూడ్ వీడియోలోను ఈ మూవీ కోసం ఐదేళ్లు వెచ్చించానని చెప్పారు నాగ్ అశ్విన్. ఇప్పుడు ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ డబ్బులు, కేకలు, ఈలలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. మహా భారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్తు కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు.





























