AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా ప్రాణాలు తీస్తుంది.. జర పైలం..! లక్షణాలు ఎలా ఉంటాయంటే..

సైలెంట్ కిల్లర్.. హార్ట్ ఎటాక్ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటోంది.. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే.. సైలెంట్ హార్ట్ ఎటాక్ (Silent Heart Attack) ని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా SMI అని కూడా అంటారు.. ఇది సాధారణంగా అసౌకర్యం, ఛాతీ నొప్పితో ప్రారంభమయ్యే గుండెపోటు..

ఒక్కసారిగా ప్రాణాలు తీస్తుంది.. జర పైలం..! లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Silent Heart Attack Symptoms
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2025 | 6:36 PM

Share

సైలెంట్ కిల్లర్.. హార్ట్ ఎటాక్ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటోంది.. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే.. సైలెంట్ హార్ట్ ఎటాక్ (Silent Heart Attack) ని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా SMI అని కూడా అంటారు.. ఇది సాధారణంగా అసౌకర్యం, ఛాతీ నొప్పితో ప్రారంభమయ్యే గుండెపోటు.. ఇది వైద్యపరంగా సులభంగా గుర్తించలేని పరిస్థితి.. నిశ్శబ్ద గుండెపోటు చికిత్సను ఆలస్యం చేయడం ప్రమాదకరం.. అయితే.. అప్రమత్తంగా ఉండటం ద్వారా మనం దీనిని నివారించవచ్చు. నిశ్శబ్ద గుండెపోటు లక్షణాలను ఎలా గుర్తించాలి..? హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి.. ఈ విషయాలను తెలుసుకుందాం..

సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు..

  1. ఛాతీలో అసౌకర్యం: సాధారణ గుండెపోటులో, ఛాతీ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.. కానీ నిశ్శబ్ద గుండెపోటు విషయంలో, ఛాతీలో కొంచెం అసౌకర్యం కలుగుతుంది. అడపాదడపా బిగుసుకుపోవడం, సంకోచం లేదా తేలికపాటి నొప్పి ఉంటే.. అది అజీర్ణం లేదా కండరాల నొప్పి కూడా కావచ్చు.. దానిని SMI అని కంగారు పడకండి.. ఏదిఏమైనా ఈ విషయంలో జాగ్రత్త అవసరం.. వెంటనే వైద్యులను సంప్రదించండి..
  2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: మెట్లు ఎక్కేటప్పుడు లేదా తేలికపాటి శారీరక శ్రమలు చేస్తున్నప్పుడు మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇవి నిశ్శబ్ద మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లక్షణాలు కావచ్చు.
  3. అలసట: తక్కువ శారీరక శ్రమ చేసి.. 8 గంటలు నిద్రపోయిన తర్వాత కూడా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, అది నిశ్శబ్ద గుండెపోటుకు సంకేతం కావచ్చు. అందువల్ల, మీకు అకస్మాత్తుగా అలసట అనిపిస్తే, వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి దానికి కారణాన్ని తెలుసుకోండి.
  4. అకస్మాత్తుగా చెమటలు పట్టడం: కష్టపడి పనిచేసిన తర్వాత లేదా ఎండలో చెమట పట్టడం చాలా సాధారణం.. కానీ ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని ఉష్ణోగ్రతలో కూడా మీరు చెమటలు పట్టడం ప్రారంభిస్తే, అది నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదాన్ని సూచిస్తుంది.
  5. నిద్ర పట్టడంలో ఇబ్బంది: నిశ్శబ్ద గుండెపోటు మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. దీని కారణంగా మీ నిద్ర విధానం చెదిరిపోతుంది.. దీని కారణంగా మీరు రాత్రిపూట తరచుగా మేల్కొని, నిద్రపోయే ప్రయత్నంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు..
  6. ఆందోళన: నిశ్శబ్ద గుండెపోటు మన మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.. మీరు ఆందోళన, మానసిక అశాంతి అనుభవిస్తుంటే అది ఆందోళన కలిగించే విషయం.. దీనిని త్వరగా పరిష్కరించాలి. అందుకోసం వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..