వామ్మో.. లవంగాలు ఎక్కువగా తింటున్నారా..? ఎంత డేంజరో తెలిస్తే బాబోయ్ అనాల్సిందే..!
వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. లవంగాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ తక్కువగా ఉన్నవారు లవంగాలను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు లవంగాన్ని ఎక్కువగా తినకూడదు. లవంగాలను ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి.. ఇది ఘాటైన రుచితో ఆహారానికి కమ్మదనాన్ని అందిస్తుంది. అంతేకాదు.. లవంగాలనీ పోషకాల పవర్‌హౌజ్ అని కూడా అంటారు. ఎందుకంటే.. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ సమృద్ధిగా నిండి ఉంటాయి. లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు తోడ్పడుతుంది. అయితే, ఇన్ని లాభాలు నిండివున్న లవంగాలను అతిగా తీసుకుంటే.. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తప్పవని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లవంగాల్లో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. దీనిని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత లాంటివి వస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలుంటే లవంగాలు తినడం మానుకోవాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. హిమోఫిలియా వంటి రక్తస్రావం రుగ్మతల విషయంలో, లవంగం తీసుకోవడం బాధిస్తుంది. లవంగాలు సన్నబడే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దెబ్బ తగిలితే ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. లవంగాలను అతిగా తీసుకోవటం వల్ల అనేక రకాల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, అతిసారం, వాంతులు వంటివి కలిగిస్తుంది.
లవంగాలు ఎక్కువగా తినడం వల్ల నోటిపూత సమస్య వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లవంగాలను అతిగా వాడటం వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయి. లవంగాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ తక్కువగా ఉన్నవారు లవంగాలను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు లవంగాన్ని ఎక్కువగా తినకూడదు. లవంగాలను ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








