Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం ఐడియా గురూ.. కారు కలర్ కాదు, లుక్కే మార్చేశాడు..! వెరైటీ డిజైన్‌ చూస్తే..

ఈ ప్రత్యేకమైన కారును చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో దీనిపై స్పందించారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు,..ఈ కారు అద్భుతంగా ఉంది. ఇది చూసి, నేను కూడా నా కారును నాణేలతో అలంకరించాలనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యనించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రజలు వేగంగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే వీడియోను 87 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.

Viral Video: ఏం ఐడియా గురూ.. కారు కలర్ కాదు, లుక్కే మార్చేశాడు..! వెరైటీ డిజైన్‌ చూస్తే..
Car Decorated With One Rupe
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 18, 2025 | 9:31 PM

మధ్యతరగతి కుటుంబానికి కారు అనేది ముఖ్యమైన వస్తువులలో ఒకటి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో, ప్రజలు కార్లలో ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలా సంవత్సరాల పాటు డబ్బు ఆదా చేసి మరీ చాలా మంది తమకు ఇష్టమైన రంగు కారును కొనుగోలు చేస్తారు. కొంతమంది కారును వారి ఇష్టానుసారం వారి కారులో మార్పులు చేసుకుంటారు. అలా వారు తమ కారు మొత్తం డిజైన్‌ని మార్చేస్తుంటారు. అలాంటి కారు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కారు మొత్తాన్ని ఒక రూపాయి నాణేలతో అలంకరించారు. అవును, మీరు విన్నది నిజమే! ఈ కారు పూర్తిగా ఒక రూపాయి నాణేలతో అలంకరించి ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కారు నంబర్ ప్లేట్ చూస్తే, ఈ కారు రాజస్థాన్ కు చెందినదని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక రూపాయి నాణేలతో కారును ఎంత చక్కగా అలంకరించారో కనిపిస్తుంది. కారులోని ప్రతి భాగం నాణేలతో కప్పబడి ఉంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే, కారు గాజు, నంబర్ ప్లేట్‌పై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వింత కారు డిజైన్‌ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కారును నాణేలతో అలంకరించాలనే ఆలోచన చాలా ప్రత్యేకమైనది. అందుకే ఈ కారు అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు చూసిన తర్వాత ప్రజలు రకరకాల స్పందనలు ఇస్తున్నారు. కొంతమంది దీనిని ‘డబ్బు కారు’ అని పిలుస్తుంటే, మరికొందరు దీనిని ‘ప్రత్యేకమైన కారు’ అని పిలుస్తున్నారు. అదే సమయంలో ఈ కారును నాణేలతో అలంకరించిన వ్యక్తి తెలివితేటలను కొంతమంది ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేకమైన కారును చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో దీనిపై స్పందించారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు,..ఈ కారు అద్భుతంగా ఉంది. ఇది చూసి, నేను కూడా నా కారును నాణేలతో అలంకరించాలనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యనించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రజలు వేగంగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే వీడియోను 87 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.

ఇది కూడా చదవండి: వార్నీ వీడెవడండీ బాబు.. పిల్లకు బదులు రైస్‌ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.!

ఇది కూడా చదవండి: తొక్కే కదా అని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!

ఇది కూడా చదవండి: పెళ్లి ఊరేగింపులో దారుణం..! గుర్రంపై ఊరేగుతూ కుప్పకూలిన వరుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..