Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. పైన మట్ట తొర్రలో కనిపించింది చూసి షాక్..

గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టుషాపుల వల్ల కల్లుకు గిరాకీ తగ్గింది. కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా కానీ తరతరాల నుంచి తమకు అన్నం పెట్టిన కు వృత్తిని వదలడం లేదు గౌడ సోదరుడు. ఇక రిస్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా....

Viral Video: కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. పైన మట్ట తొర్రలో కనిపించింది చూసి షాక్..
Snake At Palm Tree
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 19, 2025 | 11:19 AM

పొట్ట కూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మొగి పురుగు దెబ్బకు తాటి, ఈత వనాలు అంతరించిపోతున్నాయి.  ఊరూరా, వాడవాడలా వెలసిన బెల్టుషాపుల ధాటికి కల్లుకు గిరాకీ తగ్గిపోయింది. అయినప్పుడు తరతరాలకు కూడు పెట్టిన తమ కుల వృత్తిని వదిలేందుకు గౌడన్నలకు మనసు ఒప్పదు. ఆ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కొందరు పేద గౌడన్నలు ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక బతుకులీడుస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో కొందరికి రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక వారు చేసే రిస్క్ గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ గీత కార్మికుడు కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అయితే పైన ఓ తాటి మట్ట తొర్రలో ఊహించని విధంగా ఓ పాము కనిపించింది. అయితే గీత కార్మికుడు ఆ పామును చూసి.. తత్తరపాటుకు గురికాలేదు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ధైర్యసాహసాలతో వ్యవహరించాడు. జాగ్రత్తగా ఆ పామును అక్కడి నుంచి తరిమేశాడు. కాగా తాటి చెట్లు పాములను ఆకర్షిస్తాయని కొందరు అంటున్నారు.  తాటి చెట్టు నుంచి వచ్చే సువాసనతో పాటు..   చెట్టు మీద తినడానికి ఎలుకలు దొరుకుతాయని వాటి ఉద్దేశం అంటున్నారు. కాగా ఆ పాము కట్ల పాము చాలా ప్రమాదకరమైనది అని కొందరు అంటుంటే.. అది విషపూరితం కాదు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా గౌడ సోదరులు చాలా ధైర్యవంతులని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి….

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..