Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ వీడెవడండీ బాబు.. పిల్లకు బదులు రైస్‌ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.!

పెళ్లికాని వాళ్ళకి పెళ్లి కాలేదనే బాధ ఒక్కటే ఉంటుంది. కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి వందలాది బాధలు వెంటాడుతుంటాయి. పెళ్లి చేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలు అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి, అత్తమామల గురించి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు అబ్బాయి కూడా ఇలాగే... అమ్మాయి తమతో సర్దుబాటు చేసుకోగలదా లేదా అని ఆందోళన చెందుతాడు. ఈ కారణంగానే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి ప్రస్థావన అంటేనే భయపడిపోతుంటారు.. కోరి వివాహ ఇబ్బందులను తెచ్చుకోవటం ఎందుకని భావిస్తుంటారు. అలాంటి యోచనతోనే ఇక్కడ ఒక వ్యక్తి అమ్మాయి కంటే ప్రెషర్ కుక్కర్ మంచిదని భావించి కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు.

వార్నీ వీడెవడండీ బాబు.. పిల్లకు బదులు రైస్‌ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.!
Man Marries Rice Cooker
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 18, 2025 | 9:06 PM

పెళ్లికాని వాళ్ళకి పెళ్లి కాలేదనే బాధ ఒక్కటే ఉంటుంది. కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి వందలాది బాధలు వెంటాడుతుంటాయి. పెళ్లి చేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలు అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి, అత్తమామల గురించి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు అబ్బాయి కూడా ఇలాగే… అమ్మాయి తమతో సర్దుబాటు చేసుకోగలదా లేదా అని ఆందోళన చెందుతాడు. ఈ కారణంగానే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి ప్రస్థావన అంటేనే భయపడిపోతుంటారు.. కోరి వివాహ ఇబ్బందులను తెచ్చుకోవటం ఎందుకని భావిస్తుంటారు. అలాంటి యోచనతోనే ఇక్కడ ఒక వ్యక్తి అమ్మాయి కంటే ప్రెషర్ కుక్కర్ మంచిదని భావించి కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు.

ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనమ్ అనే వ్యక్తి రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. కొందరు జంతువులను పెళ్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి, ఇద్దరు అమ్మాయిలు ఏ అబ్బాయిల సహవాసం తమకు ఇష్టం లేదని చెప్పి తమను తాము వివాహం చేసుకున్న ఘటనలు కూడా అనేకం చూశాం. ఇప్పుడు రైస్‌ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించిన వార్త వెలుగులోకి వచ్చింది. అతను కుక్కర్‌ను పెళ్లి కూతురిలా అలంకరించి, దాన్ని పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో సంచలనం సృష్టిస్తున్నాడు. పైగా అతడు.. ఈ పెళ్లి వెనుక కారణంగా చెబుతూ.. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆమె నాకు ఎదురు సమాదానం చెబుతుంది..ఆమె నాకు ఆహారం వండి పెడుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నేను వంట చేసే ప్రెషర్ కుక్కర్‌నే పెళ్లి చేసుకున్నానని అని చెప్పడం వైరల్ అయింది.

రైస్‌ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా కాలంగా వార్తల్లో నిలిచిన తర్వాత.. ఇప్పుడు మరోమారు , వార్తల్లోకెక్కాడు..ఇప్పుడు అతను కుక్కర్‌తో విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించాడు. మొదట వివాహ వేడుకను నిర్వహించి, సాంప్రదాయ వివాహ దుస్తులలో ఉన్న అతడితో పాటు ముస్తాబు చేసిన కుక్కర్‌ ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇప్పుడు విడాకుల వార్తను వెల్లడించాడు. ఈ కుక్కర్ నిజంగా న్యాయంగా, విధేయుడిగా, ప్రేమగా, వంట చేయడంలో మంచిగా ఉంది, నేను చాలా అదృష్టవంతుడిని. ఆమెలాంటి అమ్మాయి మరెక్కడా దొరకదని నాకు అర్థమైంది.

ఇవి కూడా చదవండి

చివరికి విడాకులకు తీసుకుంటున్న కారణం కూడా వివరించాడు.. ఈ కుక్కర్‌ అన్నం వండటంలో నిపుణురాలు, ఆమె ఆహారం కూడా వండుతుంది. కానీ పెళ్లి తర్వాత అది నేను కోరుకున్నది ఇవ్వదు. అందుకే నేను విడాకులు ఇస్తున్నాను. మొత్తంమీద, ఈ ఫన్నీ సంఘటన అందరినీ నవ్వించింది. పైగా ఈ వ్యక్తి కూడా ఇంటర్‌నెట్‌లో ఫేమస్‌గా మారాడు. చాలా మంది వివాహితులు ఈ ఆలోచన మాకు ముందే వచ్చి ఉంటే, మేము కూడా ఇలా కుక్కర్‌నే పెళ్లి చేసుకునేవాళ్ళమంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: తొక్కే కదా అని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!

ఇది కూడా చదవండి: పెళ్లి ఊరేగింపులో దారుణం..! గుర్రంపై ఊరేగుతూ కుప్పకూలిన వరుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..