Paradise : అరరె.. క్రేజీ కాంబో మిస్సైందిగా.. నాని సినిమాను వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్.. ?
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో సినీరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హీరోయిజం, రెగ్యులర్ కథలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్న కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు నాని. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్, వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు నాని. ఇప్పుడు ఆయన నటిస్తూన్న లేటెస్ట్ హిట్ మూవీ ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నాని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ బజ్ నెలకొంది.
ఇవి కూడా చదవండి : Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ఈ చిత్రాన్ని 1980వ దశకంలో సికింద్రాబాద్ మురికివాడల నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దసరా సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని.. ఇప్పుడు మరోసారి ప్యారడైజ్ చిత్రంలోనూ మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ మూవీని దాదాపు 8 భాషలలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇదెలా ఉంటే.. ఈ సినిమాను ఓస్టార్ హీరో మిస్సైందని సో,ళ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
ముందుగా ఈ మూవీకి నాని సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఎంపిక చేసిందిట చిత్రయూనిట్. కానీ అప్పటికే పలు సినిమాలను ఓకే చేయడంతో డేట్స్ అడ్జస్ట్ కాదని రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం జాన్వీ పెద్ది చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేవర 2లోనూ కనిపించనుంది. అలాగే హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు టాక్. అయితే ఇప్పుడు జాన్వీ తర్వాత ప్యారడైజ్ సినిమా కోసం కయాదు లోహర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
