AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: మహేష్‌బాబు డెడికేషన్ అట్లుంటది మరి! ‘వారణాసి’ కోసం సూపర్‌‌స్టార్ ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్న సూపర్​స్టార్ మహేష్​బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం ఆ హీరో గత ఏడాది కాలంగా ..

Varanasi: మహేష్‌బాబు డెడికేషన్ అట్లుంటది మరి! ‘వారణాసి’ కోసం సూపర్‌‌స్టార్ ఏం చేస్తున్నారో తెలుసా?
Mahesh Babu And Varanasi Poster
Nikhil
|

Updated on: Dec 24, 2025 | 6:45 AM

Share

టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్న సూపర్​స్టార్ మహేష్​బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం ఆ హీరో గత ఏడాది కాలంగా తన రూపాన్ని పూర్తిగా మార్చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. అయితే కేవలం లుక్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ఒక అరుదైన యుద్ధ విద్యలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా కేరళ వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

పురాతన యుద్ధ విద్యలో శిక్షణ..

ఈ సినిమా కోసం సదరు హీరో కేరళకు చెందిన అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన యుద్ధ విద్య ‘కలరిపయట్టు’ నేర్చుకుంటున్నారు. ఈ విద్యలో పట్టు సాధించడం అంత సులభం కాదు. దీనికోసం ఎంతో ఏకాగ్రత, శారీరక దృఢత్వం అవసరం. రాజమౌళి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని, అందుకే హీరో స్వయంగా డూప్ లేకుండా ఈ విద్యను ప్రదర్శించేలా సిద్ధమవుతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరో పాత్ర ఒక సాహసికుడిగా ఉంటుందని, అడవుల్లో సాగే యాక్షన్ సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ కలరిపయట్టు శిక్షణ కూడా ఆ అడవి నేపథ్యంలో వచ్చే పోరాట సన్నివేశాల కోసమేనని సినీ వర్గాల టాక్. కేరళలోని ఒక శిక్షణ కేంద్రంలో మహేష్ యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న వీడియోను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోల మేకోవర్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే, ఇప్పుడు మహేష్ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోంది.

మహేష్ బాబు అంకితభావం చూస్తుంటే ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదగడం ఖాయమనిపిస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే! ఈ కలరిపయట్టు విన్యాసాలను వెండితెరపై చూడటానికి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.