AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 31: తారక్– ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్‌‌ఫుల్ రోల్‌లో బాలీవుడ్ హీరోయిన్! ఎవరో తెలుసా?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ..

NTR 31: తారక్– ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్‌‌ఫుల్ రోల్‌లో బాలీవుడ్ హీరోయిన్! ఎవరో తెలుసా?
Ntr And Bollywood Star
Nikhil
|

Updated on: Dec 24, 2025 | 6:15 AM

Share

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఒకప్పుడు తన కళ్లతోనే కోట్లాది మందిని మాయ చేసిన ఆమె, ఇప్పుడు తారక్ సినిమాలో ఒక అత్యంత కీలకమైన మరియు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు?

ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో కేవలం హీరోలను మాత్రమే కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను లేదా ఇతర కీలక పాత్రలను కూడా ఎంతో బలంగా డిజైన్ చేస్తారు. ‘కేజీఎఫ్’ లో రవీనా టాండన్ పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా అలాంటి ఒక బలమైన మహిళా పాత్ర కోసం సదరు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌ను సంప్రదించారట. ఆమె చేసే పాత్ర సినిమా మలుపు తిరగడానికి ప్రధాన కారణం అవుతుందని సమాచారం. ఇప్పటికే ఆమెకు కథ చెప్పడం, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్.

తారక్ తో మొదటిసారి..

సదరు నటి ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం ఇదే మొదటిసారి. బాలీవుడ్ లో ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ని నిలుపుకున్న ఈమె, తారక్ వంటి మాస్ హీరో సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ కుదిరితే ఉత్తరాది మార్కెట్‌లో కూడా సినిమాకు తిరుగులేని ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Ntr And Kajol

Ntr And Kajol

అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ బాలీవుడ్ సీనియర్ స్టార్ మరెవరో కాదు.. కాజోల్! ఎన్టీఆర్ 31లో కాజోల్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉంటుందా లేక మరేదైనా పవర్‌ఫుల్ పాత్రలో ఉంటుందా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. కాజోల్ ఎంట్రీ వార్త ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ యాక్షన్ మేకింగ్, తారక్ ఎనర్జీ, దానికి కాజోల్ లాంటి సీనియర్ నటి తోడైతే వెండితెరపై విజువల్ ఫీస్ట్ ఖాయమనిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి!