Tulsi Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో 10 రోజుల పాటు తులసి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
తులసి..ఇదో పవిత్రమైన మొక్క.. ఆయుర్వేదంలోనూ తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. తులసి ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తులసి ఆకు నీరు తాగడం వల్ల శరీరానికి బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసి అనేక రకాలైన రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Feb 25, 2025 | 5:12 PM

ప్రతిరోజు పరగడుపున తులసి నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తులసి నీరులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్, ఆల్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

రోజూ తులసి ఆకుల తింటే శరీరం శుభ్రంగా ఉంటుంది. తులసి ఆకులు, పసుపు పొడి వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అసిడిటీ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులు నమిలితే క్రమంగా సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే తులసి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసిలో ఉండే ఔషద గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం త్వరగా తగ్గిస్తాయి. తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, అనేక ఖనిజాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే, అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

అంతేకాదు..తులసి నీరు రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనారోగ్యకరమైన వైరస్‌లతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు పరగడుపున తులసి నీరు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తులసి ఒత్తిడి, మానసిక అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటే తులసి తినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. తులసి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.





























