Garlic Peel benefits: వెల్లుల్లి తొక్కతో పాటు తింటే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో దాదాపు మనందరికీ తెలుసు. వెల్లుల్లిని మంచి రుచి, ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. ఘాటైన వెల్లుల్లి లేకుండా దాదాపు ఏ వంటకం పూర్తి కాదనే చెప్పాలి. తరచూ వెల్లు్ల్లిని తినడం వల్ల శరీరం అనేక వ్యాధుల నుండి రక్షింపబడుతుంది. అయితే, అందరూ వెల్లుల్లి రెబ్బలను మాత్రమే ఉపయోగిస్తూ వాటి పొట్టును బయట పారేస్తుంటారు. కానీ, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పొట్టులో కూడా ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి పొట్టులోని ఔషధగుణాలు, ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 25, 2025 | 4:40 PM

వెల్లుల్లి తొక్కతో పాటు తినడం వల్ల మన ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో... వెల్లుల్లి తొక్కల్లో కూడా సమాన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఈ తొక్కలను తినడం చాలా అవసరం అంటున్నారు.

వెల్లుల్లి తొక్కల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్టుతో పాటు శరీరంలో చేరుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను కాపాడతాయి. ఇది లిపిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. వెల్లుల్లి తొక్కలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు తగ్గుతుంది.

వెల్లుల్లి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవన్నీ శరీరంలోని హానికరమైన టాక్సిన్లు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా రావని సూచిస్తున్నారు. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తనాళాలు బిగుసుకుపోకుండా విస్తరించేలా ఉంటాయి. దీని వల్ల హైబీపీ రాకుండా ఉంటుంది.

అయితే, వేసవిలో కూడా వెల్లుల్లిని ఎక్కువగా తినటం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా..? అనే సందేహం మీలో కూడా ఉండి ఉంటుంది.. కానీ, వేసవిలో వెల్లుల్లిని అవసరమైన మేరకు తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే..

పచ్చి వెల్లుల్లి కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని విష వ్యర్థాలు తొలగిపోతాయి. పచ్చి వెల్లుల్లి మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

వెల్లుల్లి తొక్కలో ఉండే ప్రోటీన్లు చర్మంలో కొలాజెన్ పెంచడానికి సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని పెరుగులో కలిపి ఫేస్ ప్యాక్ లా వాడడం వల్ల చర్మం యవ్వనంగా మెరిసిపోతూ ఉంటుంది. గీతలు, ముడతలు వంటివి రాకుండా ఉంటాయి.




