- Telugu News Photo Gallery Spiritual photos These are the foods that should not be consumed by those fasting on Mahashivratri
మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. తినాల్సినవి, తినకూడని ఆహారాలు ఇవే!
మహాశివరాత్రి వచ్చేసింది. ఫిబ్రవరి 26న ప్రతి పల్లెలో, పట్టణంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతాయి. అయితే ఈరోజు శివ భక్తులందరూ ఉపవాసం ఉంటూ, ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో కొలుకుకుంటారు. అయితే ఉపవాసం చేసేవారు ఆరోజు ఏ ఆహారాలు తినాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏవి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Feb 25, 2025 | 2:56 PM

మహాశివరాత్రికి ఉపవాసం ఉండే వారు త్రయోదశి రోజున ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలంట. అలాగే రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయాలంట.

అయితే శివరాత్రి రోజు భక్తులు పూజను రాత్రిపూట ఒకసారి లేదా నాలుగుసార్లు చేయవచ్చునంట. ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి, పవిత్రస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి.

వీరు నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి, శివలింగంపై కొబ్బరి నీళ్లు చల్లకూడదు, శివుడికి సమర్పించినవి ఏవి కూడా వీరు తినకూడదంట. అలాగే, టీ, కాఫీలు కూడా తాగకూడదంట.

ఉపవాసం ఉన్న భక్తులు పండ్లు, పాలు, అరటిపండు, చిరుధాన్యాలు, బంగాళాదుంప, డ్రైఫ్రూట్స్ వంటివి తినాలి అంటున్నారు పండితులు.

గోధుమ రొట్టె, బియ్యం వంటి ధాన్యాలు, పప్పు, చిక్కుళ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహార ఆహారాలు, వంటివి ఉపవాసం చేసే వారు అస్సలే తినకూడదు. ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలంట.