AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : కివీస్ టీమ్‎లో కొత్త రచ్చ..కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!

IND vs NZ : వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ తన జట్లను ప్రకటించింది. ఈ సిరీస్ జనవరి 11న వడోదరలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

IND vs NZ : కివీస్ టీమ్‎లో కొత్త రచ్చ..కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
Newzealand Squad
Rakesh
|

Updated on: Dec 24, 2025 | 8:00 AM

Share

IND vs NZ : వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ తన జట్లను ప్రకటించింది. ఈ సిరీస్ జనవరి 11న వడోదరలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు యువ ఆటగాళ్లకు, అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని ఆటగాళ్లకు ఎక్కువ అవకాశమిచ్చింది. ముఖ్యంగా లెఫ్ట్-ఆర్మ్ పేస్ బౌలర్ జేడెన్ లెన్నాక్స్ తొలిసారిగా వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. క్రిస్టియన్ క్లార్క్, అదిత్య అశోక్, జోష్ క్లార్క్సన్ వంటి యువ ఆటగాళ్లకు భారత్ లాంటి పెద్ద వేదికపై తమ సత్తా చాటే అవకాశం దక్కింది.

న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గజ్జల్లో గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అయితే టీ20 సిరీస్ సమయానికి శాంట్నర్ కోలుకుంటాడని భావిస్తున్న బోర్డు, అతడిని టీ20 కెప్టెన్‌గా ప్రకటించింది. మరోవైపు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ టూర్‌కు అందుబాటులో లేడు. అతను సౌతాఫ్రికాలో జరిగే SA20 లీగ్‌లో ఆడనున్నాడు. అలాగే సీనియర్ ఆటగాడు టామ్ లాథమ్ కూడా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడం గమనార్హం.

గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన మార్క్ చాప్‌మన్, మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టులోకి వచ్చారు. మ్యాట్ హెన్రీ రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వన్డే సిరీస్ ఆడటం లేదు, కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కానున్నాడు. రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీలకు బిజీ షెడ్యూల్ కారణంగా వన్డేల నుండి విశ్రాంతి ఇచ్చారు. కివీస్ జట్టు ఈసారి పూర్తిస్థాయిలో ప్రయోగాత్మక జట్టుతో భారత్‌లో అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది.

న్యూజిలాండ్ స్క్వాడ్‌లు ఇవే

న్యూజిలాండ్ వన్డే స్క్వాడ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫాల్క్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెన్నాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, విల్ యంగ్.

న్యూజిలాండ్ టీ20 స్క్వాడ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), జాకబ్ డఫ్ఫీ, జాక్ ఫాల్క్స్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, బెవోన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఈష్ సోధి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
OTT Movie: ధురంధర్ కాదు..పాక్‌లో ఈ తెలుగు సినిమా తెగ చూస్తున్నారు
OTT Movie: ధురంధర్ కాదు..పాక్‌లో ఈ తెలుగు సినిమా తెగ చూస్తున్నారు
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.20కే వీటి పంపిణీ
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.20కే వీటి పంపిణీ