AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness Record: చీర ధర రూ.39 లక్షలా? ఎక్కడ తయారు చేశారు. ప్రత్యేకలేంటి?

భారతీయ మహిళలకు పట్టుచీరలంటే ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పట్టుచీరలు కొంటుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక చీర ధర ఏకంగా రూ. 39 లక్షలు ఉంటుందని ఊహించారా? అవును ..

Guinness Record: చీర ధర రూ.39 లక్షలా? ఎక్కడ తయారు చేశారు. ప్రత్యేకలేంటి?
Pattu Saree
Nikhil
|

Updated on: Dec 24, 2025 | 8:00 AM

Share

భారతీయ మహిళలకు పట్టుచీరలంటే ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పట్టుచీరలు కొంటుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక చీర ధర ఏకంగా రూ. 39 లక్షలు ఉంటుందని ఊహించారా? అవును, మీరు విన్నది నిజమే! ఒక విలాసవంతమైన కారు లేదా ఒక అపార్ట్‌మెంట్ కొనే ధరతో ఒకే ఒక్క చీరను తయారు చేశారు. కేవలం ధర మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. అసలు ఈ చీరలో అంత స్పెషాలిటీ ఏముంది? ఎందుకు దీనికి అంత ధర? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చీరను కేవలం ఒక వస్త్రంగా కాకుండా ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీని పల్లూ భాగంలో ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 11 అద్భుతమైన పెయింటింగ్స్‌ను నేతపనితో పునర్నిర్మించారు. ఇందులో ప్రధానంగా ‘గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్’ అనే ప్రసిద్ధ చిత్రాన్ని చీర మధ్యలో అత్యంత స్పష్టంగా కనిపించేలా రూపొందించారు. రవివర్మ గీసిన మహిళల చిత్రాలు, వారి ఆభరణాలు, వస్త్రధారణ ఎంత సహజంగా ఉంటాయో.. వాటన్నింటినీ ఈ పట్టుచీరపై అంతే సహజంగా మలిచారు.

బంగారం, వెండి, నవరత్నాల హంగులు..

ఈ చీర తయారీలో వాడిన ముడిసరుకు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీని నేత కోసం కేవలం పట్టు దారాలు మాత్రమే కాకుండా, ఏకంగా 59 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వాడారు. అలాగే 3 కిలోల వెండి, ప్లాటినం తీగలను కూడా ఉపయోగించారు. ఇక ఈ చీర మెరుపును పెంచడానికి వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, పగడాలు మరియు నీలమణి వంటి నవరత్నాలను చీర అంతటా పొదిగారు.

చెన్నైకి చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ సంస్థ ‘చెన్నై సిల్క్స్’ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. దీనికి “వివాహ పట్టు కాంచీవరం” అని పేరు పెట్టారు. సుమారు 35 మంది నిపుణులైన నేత కార్మికులు ఒక సంవత్సరం పాటు కష్టపడి ఈ చీరను నేశారు. దీని బరువు దాదాపు 8 కేజీల వరకు ఉంటుంది. అప్పట్లోనే ఈ చీర విలువ రూ. 39,31,627గా నిర్ణయించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పట్టుచీరగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యానికి ఈ ‘వివాహ పట్టు’ ఒక నిదర్శనం. రాజా రవివర్మ కళాఖండాలను పట్టు దారాలతో, నవరత్నాలతో మేళవించి రూపొందించిన ఈ చీర చూస్తుంటే.. ధర రూ. 39 లక్షలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపిస్తుంది. నేటికీ ఫ్యాషన్ ప్రపంచంలో ఇదొక అద్భుతంగా మిగిలిపోయింది!

కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
OTT Movie: ధురంధర్ కాదు..పాక్‌లో ఈ తెలుగు సినిమా తెగ చూస్తున్నారు
OTT Movie: ధురంధర్ కాదు..పాక్‌లో ఈ తెలుగు సినిమా తెగ చూస్తున్నారు
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.20కే వీటి పంపిణీ
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.20కే వీటి పంపిణీ