Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా శివరాత్రి రోజు చిలగడ దుంప ఎందుకు తింటారు..? ఉపవాస సమయంలో తప్పనిసరిగా తినాలా..?

మహా శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఆ రోజు రోజంతా భోజనం తీసుకోకుండా భగవంతుడిని ప్రార్థిస్తారు. ఉపవాసం ముగిసిన తర్వాత తీసుకునే ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. దీనిని తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది. అందుకే చాలా మంది శివరాత్రి రోజు చిలగడ దుంప తినేందుకు ఆసక్తి చూపిస్తారు.

మహా శివరాత్రి రోజు చిలగడ దుంప ఎందుకు తింటారు..? ఉపవాస సమయంలో తప్పనిసరిగా తినాలా..?
Mahashivratri Fasting
Follow us
Prashanthi V

|

Updated on: Feb 25, 2025 | 6:19 PM

చిలగడ దుంపకు వివిధ ప్రాంతాల్లో భిన్నమైన పేర్లు ఉన్నాయి. దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఈ దుంప పోషకాహారంతో నిండి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా దీనిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. బడ్జెట్‌లో సులభంగా లభించే ఈ దుంపను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు.

శివరాత్రి ఉపవాసం పాటించే భక్తులు సాయంత్రం ఉపవాసం ముగించేటప్పుడు చిలగడ దుంపను తీసుకుంటారు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు శక్తిని అందిస్తుంది. రాత్రి నిద్ర లేకుండా జాగరణం ఉండే కారణంగా శరీరానికి తగిన శక్తిని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇది శరీరానికి పలు పోషకాల్ని అందిస్తుంది. బీటా కెరొటిన్, విటమిన్‌ ఎ, సి, ఇ, బి-6, పొటాషియం, పీచు అధికంగా ఉంటుంది. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

  • జీర్ణ వ్యవస్థకు మేలు.. ఇందులో ఉన్న పీచు, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
  • ఎముకలకు బలాన్ని అందిస్తుంది.. పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు మేలు చేస్తుంది.
  • క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధిస్తుంది.
  • కళ్ల ఆరోగ్యానికి మేలు.. విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.
  • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. అధిక రక్తపోటును తగ్గించేందుకు, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
  • గర్భిణీలకు శ్రేయస్కరం.. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఇది సహాయపడుతుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి మంచిది.. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచుతో ఉండే ఇది పొట్ట నిండిన భావన కలిగిస్తుంది.
  • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. ఒత్తిడిని తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • జుట్టు, చర్మానికి మేలు.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. చిలగడ దుంప ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)