AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: విజయానికి 3 పరుగులు.. చేతిలో 47 బంతులు.. ధోని మ్యాజిక్ చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

ధోని కెప్టెన్సీలో టీమిండియా అసాధారణమైన విజయాలు అందుకుంది. అక్కడ ధోని ఉన్నాడంటే.. కచ్చితంగా టీమిండియా గెలుపు పక్కా అనుకునేవారు. సరిగ్గా ఈ మ్యాచ్ ఆ కోవకు చెందినది. మరి ఆ స్టోరీ ఏంటి.? ఆ మ్యాచ్ ఏంటి.? ఈ వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

Video: విజయానికి 3 పరుగులు.. చేతిలో 47 బంతులు.. ధోని మ్యాజిక్ చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Cricket
Ravi Kiran
|

Updated on: Jan 18, 2026 | 8:34 AM

Share

2011 వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 47 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 2 వికెట్లున్నాయి. ఆ సమయంలో ధోని అద్భుతమైన కెప్టెన్సీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఫ్ సైడ్ ఫీల్డర్లను మోహరించి.. మునాఫ్ పటేల్‌తో వ్యూహాత్మక బౌలింగ్ చేయించాడు. సఫారీలను భారీ షాట్లకు పురిగొల్పి.. కేవలం ఒక పరుగు తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. వివరాల్లోకి వెళ్తే.! ఒకప్పుడు టీమిండియాకు ధోని కెప్టెన్‌గా ఉన్నాడంటే.. కచ్చితంగా ఆ మ్యాచ్ భారత్‌దే అని అనుకునేవారు. సరిగ్గా అలాంటి ఓ మ్యాచ్ ఈ కోవకు చెందినది. 2011లో జరిగిన ఒక వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లో టీమిండియా అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న దక్షిణాఫ్రికా.. చివరి 47 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అప్పుడు ప్రత్యర్ధి జట్టు చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ చేసే జట్టు విజయం సాధించడం అసాధ్యం అని చెప్పొచ్చు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

అయితే, అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోని తన కెప్టెన్సీతో ఈ మ్యాచ్ గమనాన్ని మార్చివేశాడు. ధోని తన అద్భుతమైన కెప్టెన్సీతో దక్షిణాఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చేలా ఒక వ్యూహాత్మక ఉచ్చును పన్నాడు. ఆఫ్ సైడ్ సర్కిల్‌లో ఎక్కువ మంది ఫీల్డర్లను మోహరించి.. మునాఫ్ పటేల్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌లను భారీ షాట్లు ఆడేలా ప్రలోభపెట్టాడు. నాలుగు పరుగులు కొట్టి మ్యాచ్‌ను గెలవాలని భావించిన సఫారీ ఆటగాళ్లు ఈ ఉచ్చులో పడ్డారు. భారీ షాట్లకు ప్రయత్నించి, కేవలం ఒక్క పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ గెలవదని భావించిన భారత జట్టు ఈ అనూహ్య విజయంతో సంచలనం సృష్టించింది. ఇది ధోని కెప్టెన్సీ సత్తా అని నెటిజన్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..