AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaratri 2025: సకల సంపదలనిచ్చే ఏకైక అభిషేకం ఇదే.. శివరాత్రి రోజున ఈ ఒక్కటి మరువకండి..

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటి పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి. ఆ దేవదేవుడి దర్శించుకునేందుకు దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి నాడు చేసే అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే, వివిధ పదార్థాలు ఉపయోగించి చేసే అభిషేకాలు గ్రహ బాధలతో పాటు సకల దరిద్రాలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతారు. ఎలాంటి ఫలితాలు పొందడానికి ఏ రకమైన అభిషేకం చేయాలో తెలుసుకోండి..

Shivaratri 2025: సకల సంపదలనిచ్చే ఏకైక అభిషేకం ఇదే.. శివరాత్రి రోజున ఈ ఒక్కటి మరువకండి..
Shivabhishekam
Bhavani
|

Updated on: Feb 25, 2025 | 5:47 PM

Share

శివుడు భోళా శంకరుడు.. చెంబెడు నీళ్లు నెత్తిమీద పోసినా చాలు ఆయన అనుగ్రహానికి పాత్రులం కావొచ్చు. శివుడిని అర్చించడంలో ముఖ్యమైనది అభిషేకమే. శిరస్సుపై గంగను ధరించిన ఆ లయకారుడు అభిషేక ప్రియుడు. కానీ, శివరాత్రి పర్వదినం గురించి యోగులు, బుుషులు ఎన్నో రహస్య విషయాలను మనకందించారు. అందులో ఒకటి ఈ రోజున చేసే అభిషేకం. శివుడిని శివరాత్రి రోజున ఎవరైతే కొన్ని ప్రత్యేక పదార్థాలతో అభిషేకిస్తారో వారికి ఇహపర సుఖాలన్నీ లభిస్తాయనేది అనాదిగా వస్తున్న విశ్వాసం కూడా. మరి ఏ ద్రవ్యంతో శివుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీరే తెలుసుకోండి..

ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది.

ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది.

ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు.

చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే ఎదురవుతున్నాయా.. మీరు శివుడిని చెరకు రసంతో అభిషేకించండి.

తేనె.. తేనెతో చేసే అభిషేకం మీలో తేజస్సును పెంచుతుంది.

భస్మజలం.. భస్మాన్ని ఒంటికి రాసుకుని తిరిగే పరమశివుడిని అదే భస్మ జలాలతో అభిషేకిస్తే ఎంతటి పాపాలైనా నశిస్తాయి.

సుగంధోదకం.. పుత్రుల కోసం ఎదరుచూస్తున్నావారు ఇలా అభిషేకిస్తే వారింట త్వరలోనే శుభవార్త వింటారని చెప్తారు.

పుష్పోదకం.. భూమి కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు వంటివి కోరుకునే వారు.. పుషాలతో శివుడిని అభిషేకించాలి.

బిల్వజలం.. భోగభాగ్యాలు కలిగించే ఏకైక అభిషేకం బిల్వ ఆకుల నీటితో చేసేది.

నువ్వుల నూనె.. అపమృత్యు దోషాలు లేకుండా చేసేది నువ్వుల నూనెతో చేసే శివాభిషేకం.

రుద్రాక్షోదకం.. ఐశ్వర్యం పెరగాలని కోరుకునే వారు రుద్రాక్షలతో శివుడిని పూజించాలి.

సువర్ణజలం.. దరిద్రాలన్నీ తరిమికొట్టే శక్తి సువర్ణ జలానికి ఉంది.

అన్నాభిషేకం.. అన్నంతో స్వామివారిని అభిషేకిస్తే సుఖ జీవనం ప్రాప్తిస్తుంది.

ద్రాక్షరసం.. సకల కార్యాల్లోనూ విజయం సాధించాలనుకునే వారు ద్రాక్షరసంతో అభిషేకం చేయాలి.

నారికేళ జలం.. సర్వ సంపదలు వృద్ధి చెందాలని కోరుకునేవారు నారికేళ జలంతో స్వామివారిని అభిషేకించాలి.

ఖర్జూర రసం.. శత్రుపీడతో బాధపడేవారు శివుడికి ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే ఈ భయాల నుంచి విముక్తులవుతారు.

గరిక జలం.. గరిక జలంతో శివుడిని అభిషేకిస్తే ఆర్థిక అభివృద్ధి పొందుతారు.

ధవళోదకమ్.. శివ సాన్నిధ్యం పొందాలనుకునే వారు ఇలా అభిషేకించండి.

గందోదకమ్.. సర్వ సమఈద్, సంపదలను ప్రాప్తింపజేసుకునేందుకు గందోదకమ్ తో అభిషేకించండి.

కస్తూరి జలం.. చక్రవర్తిత్వం, రాజసం కలుగజేసేది కస్తూరి జలంతో శివుడికి చేసే అభిషేకం.

నేరేడు పండ్ల రసం.. వైరాగ్యం కలుగుతుంది.

నవరత్న జలం.. సొంతింటి కళ నెరవేరుతుంది.

మామిడిపండు రసం.. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి.

పసుపు, కుంకుమ.. ఇంట్లో శుభకార్యాలు నెరవేరుతాయి.

విభూది.. కోటి రెట్ల ఫలితం ఉంటుంది.