Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం.. 67 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో..
గురు స్వామి సారథ్యంలో శరవేగంగా పనులు పూర్తి చేశారు...పూర్తిగా సిమెంట్ తో నిర్మించిన ఈ విగ్రహానికి రూ.30లక్షల వరకు ఖర్చయినట్లు గురుస్వామి తెలిపారు. ఇది కేవలం విగ్రహాన్ని చెక్కిన శిల్పికి మాత్రమే... విగ్రహానికి సిమెంట్ కి ఖర్చు మరో 25 లక్షలు అయినట్లు చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. విగ్రహం వెనుక భాగంలో యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు... ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో నిలువెత్తు శివలింగాన్ని ప్రతిష్టించారు.

దేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు…తమిళనాట కోయంబత్తూరులో (112 అడుగుల ఎత్తు) లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే… అయితే ఇప్పుడు మూడో పెద్ద విగ్రహం ఆంధ్రాలో ముస్తాబవుతోంది…. ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న ఉమ్మడి ఉబయోగ గోదావరి జిల్లాలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో ఈ ఆది యోగి విగ్రహం శివరాత్రి పర్వదినాన అందరిని ఆకర్షించనుంది…
ఆంధ్రా శబరిమలగా పేరొందిన ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో పదినెలల వ్యవధిలో దీన్ని నిర్మించారు. ఈనెల 26న శివరాత్రి రోజున ప్రారంభం కానున్నట్లు ఆలయ గురుస్వామి ఎస్ఎల్ కనకరాజు వెల్లడించారు…. గురు స్వామి సారథ్యంలో శరవేగంగా పనులు పూర్తి చేశారు…పూర్తిగా సిమెంట్ తో నిర్మించిన ఈ విగ్రహానికి రూ.30లక్షల వరకు ఖర్చయినట్లు గురుస్వామి తెలిపారు. ఇది కేవలం విగ్రహాన్ని చెక్కిన శిల్పికి మాత్రమే… విగ్రహానికి సిమెంట్ కి ఖర్చు మరో 25 లక్షలు అయినట్లు చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. విగ్రహం వెనుక భాగంలో యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు… ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో నిలువెత్తు శివలింగాన్ని ప్రతిష్టించారు.
బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన శిల్పి పెద్దరాఘవ, తన శిష్య బృందంతో కలిసి నిర్మించినట్లు ఆలయ గురుస్వామి పేర్కొన్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద శివుని విగ్రహమని గురు స్వామి తెలిపారు. కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఆది యోగి విగ్రహం వద్ద శివరాత్రి సంబరాలకు వెళ్లలేని గోదావరి జిల్లాల భక్తులు..ఇక ద్వారపూడికి పెద్ద ఎత్తున పయనం అవనున్నారు.. రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్లు.. కాకినాడ నుంచి ద్వారపూడి 47 కిలోమీటర్లు…. అమలాపురం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర శబరిమల ద్వారపూడి ఆదియోగి విగ్రహానికి సమయం పట్టనుంది.. ఇప్పటికే సైవక్షేత్రాలతో కోనసీమ విరాజిల్లుతుంటే… ద్వారపూడిలో ఈ ఆది యోగి శివరాత్రికి మరింత ఆధ్యాత్మికను పెంచనుందని చెప్పాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..