ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో VH భేటీ.. ఆ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని వినతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని వీహెచ్ సూచించారు. అలాగే ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించేందుకు చొరవ చూపాలని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్‌తో మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. మంగళవారం (25 ఫిబ్రవరి 2025)నాడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. సామాజిక ఫించన్లు రావడంలో, కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో దామోదరం సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కల్యాణ్ గారు తెలిపారు. ఈ సందర్భంగా వీ హనుమంతరావుని పవన్ కల్యాణ్ సన్మానించి జ్ఞాపికను అందించారు.
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

