Vizag: విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
విశాఖపట్నం రుషికొండ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న నలుగురు సభ్యుల బృందానికి అరుదైన తిమింగలం దర్శనమిచ్చింది. 45 అడుగుల లోతులో కనిపించిన ఈ భారీ వేల్ షార్క్ డైవర్లతో కొంతసేపు కలిసి ప్రయాణించి, ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోయింది. ఈ మరచిపోలేని అనుభవం డైవర్లను ఆశ్చర్యపరిచింది. సముద్ర జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఇది శుభసంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
విశాఖలోని రుషికొండ సముద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో డైవర్లకు భారీ తిమింగలం దర్శనమిచ్చింది. ఈ అరుదైన సంఘటనతో డైవర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో, 45 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ కోసం నలుగురు సభ్యులతో కూడిన బృందం సముద్రంలోకి వెళ్లింది. ఆఫ్‌షోర్ డైవ్ సైట్లను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో, అకస్మాత్తుగా వేల్ షార్క్ వారి కళ్లముందు ప్రత్యక్షమైంది. ఆ తిమింగలం డైవర్ల సమీపంలో సంచరించడం గమనించారు. స్కూబా డైవర్లు ఈ తిమింగలం తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని ఒకింత ఆందోళన చెందారు. తిమింగలం డైవర్లకు ఎలాంటి హాని చేయకుండా, డైవర్లతో పాటు తిమింగలం కొంతసేపు డైవింగ్ చేస్తూ అలరించింది. తర్వాత తన దారిన లోతైన సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన డైవర్లు ఇది తమ జీవితంలో మరచిపోలేని అనుభవమని తెలిపారు. సముద్ర జీవ వైవిధ్యానికి ఇది మంచి ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు. విశాఖ తీర ప్రాంతంలో ఇటువంటి అరుదైన సముద్ర జీవులు కనిపించడం పర్యావరణ పరిరక్షణకు అనుకూల సంకేతమని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే
Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్
Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది
మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు
Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

