AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 7:08 PM

Share

జార్ఖండ్‌లో ఏనుగు-మానవ ఘర్షణ తారాస్థాయికి చేరింది. పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాలో గుంపు నుంచి విడిపోయిన ఒక ఏకదంత ఏనుగు 'మస్త్' దశలో ఉండి, 22 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ప్రభుత్వం 'ఎలిఫెంట్ ఎమర్జెన్సీ' ప్రకటించింది. అటవీ క్షీణత కారణంగా ఆహారం, నీటి కోసం ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయి, గత 25 ఏళ్లలో 1,400 మంది మరణించారు. ఈ ఉద్రిక్తత ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది.

జార్ఖండ్ లో ఏనుగులు మనుషుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాలో గుంపు నుంచి తప్పించుకున్న ఓ ఏకదంత ఏనుగు విధ్వంసం సృష్టిస్తోంది. కనిపించిన వారిపైకి దూసుకెళ్లి తొక్కేస్తూనే.. తొండంతో వారిని విసిరి విసిరి కొడుతోంది. ఇలా ఇప్పటి వరకు ఈ ఏనుగు చేసిన దాడిలో.. 22 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో ‘ఎలిఫెంట్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. ఏనుగు తన గుంపు నుంచి విడిపోవడంతో విపరీతమైన కోపంతో ఊగిపోతోంది. దీనికి తోడు అది ప్రస్తుతం ‘మస్త్’ అనే దశలో ఉంది. ఈ దశ రెండు నెలలుంటుంది. ఏనుగులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగే ఈ దశలో అవి అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయి. రోజుకు సుమారు 30 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తూ కంటపడిన వారిని తొక్కుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే 22 మంది చనిపోగా.. స్థానిక ప్రజలంతా గజగజా వణికిపోతున్నారు. ఆ ఏకదంతం ఏనుగు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. అయితే ఒక్క మగ ఏనుగు దాడి వల్ల ఈ స్థాయిలో మరణాలు సంభవించడం చరిత్రలో ఇదే తొలిసారి అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ మీనా తెలిపారు. ప్రభుత్వం 100 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించింది. ఏనుగును పట్టుకునేందుకు ఇప్పటి వరకు మూడుసార్లు మత్తుమందు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఆ గజరాజు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక గ్రామస్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రామ్‌గఢ్, బొకారో, హజారీబాగ్ లోనూ ఏనుగుల గుంపులు ఇళ్లను, పంటలను ధ్వంసం చేస్తూ భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జార్ఖండ్‌లో ప్రస్తుతం 550 నుంచి 600 వరకు ఏనుగులు ఉన్నాయి. అయితే పెరుగుతున్న అడవుల నరికివేత వల్ల ఆహారం, నీటి కోసం ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయి. 2000 నుండి 2025 మధ్య కాలంలో జార్ఖండ్‌లో ఏనుగుల దాడిలో 1,400 మంది మరణించగా.. 600 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2026 ప్రారంభంలోనే మరణాల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు

Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ

Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క