మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ కల్వకుల్ శివారులో గల క్లాసిక్ దాబాపై యువకులు దాడికి పాల్పడ్డారు. చేతికి టీ అందించలేదనే కారణంతో వారు దాబాలోని అద్దాలు, సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, దాడి చేసినవారు మనోహరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.