రక్త ప్రసరణను పెంచే ఫ్రూట్స్ ఇవే.. ఇవి తింటేనే మీ గుండె పదిలం!
Samatha
24 January 2026
రక్తప్రసరణ బాగుంటే, ఆరోగ్యం బాగున్నట్లే. అందుకే పెద్దవారు చెబుతుంటారు, మంచి ఆహారం తీసుకొని , కష్టపడి పని చేస్తే రక్తప్రసరణ సరిగ్గా జరిగి ఆరోగ్యంగా ఉంటారని.
రక్తప్రసరణ
కానీ కొంత మంది ఎన్ని పనులు చేసినా, ఎలాంటి ఆహారం తీసుకున్నా రక్తప్రసరణ సరిగ్గా జరగక ఇబ్బంది పడతారు. అయితే రక్తప్రసరణ జరగాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం.
ఆహార పదార్థాలు
ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ , ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరంలో రక్తప్రసరణ బాగా జరగడానికి దోహదపడతాయి.
ఉల్లిపాయలు
వెల్లుల్లి శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఇందులో ఉండే సల్ఫర్ రక్తపోటును తగ్గించి, రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. గుండెకు చాలా మంచిది.
వెల్లుల్లి
మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉండే నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయంట.
నట్స్
పిష్ అంటే చాలా మందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ అన్నింటిలో కెళ్లా ట్యూనా ఫిష్ రక్తప్రసరణకు చాలా మంచిదంట. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళలో కొవ్వును తొలిగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
ట్యూనా ఫిష్
సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వలన ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయంట.
సిట్రస్ ఫ్రూట్స్
అరటి పండు , బొప్పాయి కూడా చాలా మంచిది వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.